Viral New: దేవుడి హుండీ లెక్కింపులో షాకింగ్ ఘటన.. నా అప్పుల బాధ్యత నీదేనంటూ లెటర్... ఎక్కడో తెలుసా..?

Tamilnadu: ధర్మపురి కుమారస్వామిపేటలో శివసుబ్రమణ్యస్వామి వారి ఆలయం ఉంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయంను నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో నాణేలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ఆలయంలో తైపూసద్ తీర్ధోత్సవం తర్వాత ప్రతిఏడాది భక్తుల ద్వారా... కానుకల రూపంలో వచ్చిన హుండీ ఆదాయంను లెక్కిస్తుంటారు.  ఈసారి హుండీ లెక్కింపులో ఒక లెటర్ చూసి అధికారలు నోరెళ్లబెట్టారు.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 17, 2024, 03:16 PM IST
  • - దేవుడి హుండీ లెక్కింపులో ఊహించని ఘటన..
    - వేల కోట్ల అప్పులు తీర్చాలంటూ దేవుడికి లెటర్..
Viral New: దేవుడి హుండీ లెక్కింపులో షాకింగ్ ఘటన.. నా అప్పుల బాధ్యత నీదేనంటూ లెటర్... ఎక్కడో తెలుసా..?

Unknown Devotee Debt letter Goes Viral Tamilnadu: మనలో చాలా మంది అవసరాలకు కొన్నిసార్లు అప్పులు చేస్తుంటారు. పెళ్లిళ్లలకు లేదా పిల్లల చదువుల్లో కాలేజీలో ఫీజులు కట్టడానికి అప్పులు చేస్తుంటారు. అయితే.. ఇలా అప్పులు చేయడం మాత్రంపూర్తిగా తప్పనికాదు. కొన్నిసార్లు అంతా డబ్బు ఒకేసారి అడ్జస్ట్ కాకపోవచ్చు. ఇలాంటి సమయంలో తెలిసిన వారి దగ్గర నుంచి అప్పులు తీసుకున్న ఆ తర్వాత నెమ్మదిగా అప్పులు తీర్చేస్తుంటారు. ఇది మనం కామన్ గా చూస్తుంటాం.

Read More: Keerthy Suresh: గోల్డ్ రంగు చీరలో కీర్తి సురేష్.. ధగధగ మెరిసిన హీరోయిన్

మరికొందరు వెరైటీ మనుషులంటారు.. తమ జల్సాలకు, అడ్డమైన అలవాట్లకు అప్పులు చేస్తుంటారు. తాగడానికి, టూర్లకంటూ అప్పులు తీసుకుంటారు. ఆ తర్వాత అప్పులు ఇచ్చిన వారికి చుక్కలు చూపిస్తుంటారు. ఇక.. చేసిన అప్పులు తీర్చలేక కొందరు చేతులెత్తేస్తుంటారు.. ఐపీలు పెట్టడం, ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేసుకుని కన్పించకుండా పోవడం వంటివి చూస్తుంటాం. ఇక.. అనుకోకుండా అప్పులు తీసుకుంటే.. ఒక మంచి దారి చూపించి అప్పులు తీర్చేలా చూడాలంటూ దేవుడికి చాలా మంది మొక్కులు మొక్కుకుంటారు. ఇలాంటివి మనం తరచుగా చూస్తుంటాం. కానీ ఇక్కడోక వ్యక్తి మాత్రం.. నా అప్పును నువ్వే తీర్చాలంటూ ఏకంగా దేవుడికే లెటర్ రాశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. 

తమిళనాడులో ధర్మపురి కుమారస్వామిపేటలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. ఇక్కడ టెంపుల్ ను దేవాదాయశాఖ నిర్వహిస్తుంది. ప్రతి ఏటా ఈ ఆలయంలో.. తాయ్ పూసద్ తీర్థోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలిస్తుంటారు. సుబ్రహ్మణ్యస్వామికి మొక్కుకుని తమ కానుకలు హుండీలో సమర్పించుకుంటారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 4 న తాయ్ పూసద్ ఉత్సవం జరిగింది. ఈ క్రమంలో.. దేవాదాయ, ఆలయ కార్యనిర్వాహక అధికారులు ఆలయంలోని హుండీ లెక్కింపును చేపట్టారు. హుండీలోని డబ్బులు, నాణేలు, బంగారం కాయిన్స్, నోట్లను అధికారులు రాశుల కుప్పగా పోశారు. కొందరు అక్కడ హుండీని లెక్కించే పనిలో ఉన్నారు. దీన్ని సీసీ కెమెరాలో ఆలయ సిబ్బంది గమనిస్తుంటారు. హుండీని లెక్కిస్తున్న సిబ్బందికి ఒక లెటర్ దొరికింది. దాన్ని చూసి అతను నోరెళ్లబెట్టి ఆలయ అధికారులకు చూపించాడు. అది చూసిన వాళ్లు... ఆశ్చర్యంతో ఉండిపోయారు.

ఒక భక్తుడు.. తాను చేసిన అప్పులను వెంటనే తీర్చేయాలని ధర్మపురి కుమారస్వామికి మొరపెట్టుకున్నాడు. అంతే కాకుండా.. అతను తీసుకున్న, అతనికి రావాల్సిన అప్పులు వివరాలను కూడా వివరంగా అందులో రాసుకొచ్చాడు.  ఓ భక్తుడు రాసిన లేఖలో... తాను ఎవరనేది పేర్కొనకుండా..  ఈ లేఖలో తాను చాలా మందికి అప్పుగా ఉన్న రుణం (మొత్తం రూ. 1 కోటి 43 లక్షల 50 వేలు) రాసి, రుణమంతా త్వరగా అందజేయాలని, అదే విధంగా, మరి కొందరి నుంచి తనకు రావాల్సిన రూ.10 కోట్ల 10 లక్షలు కూడా ఇవ్వాలని పేర్కొన్నారు.

Read More: Smelly Shoes: మీ బూట్ల నుంచి భరించలేని దుర్వాసన వస్తుందా..?.. ఈ సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టేయోచ్చు..

ఆలయ  అధికారులు ఈ లెటర్ చూసి ఖంగుతిన్నారు. అంతటితో ఆగకుండా.. ఉత్తరం చివర కంద షష్ఠి కూడా కొన్ని కవాస పంక్తులు రాసి 'మురుగన్ కు క్రెడిట్ రావాలి' అని అభ్యర్థించారు. ప్రస్తుతం ఈ పేరు తెలియని భక్తుడు రాసిన లేఖ ధర్మపురిలో కలకలం రేపింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News