Keerthy Suresh: గోల్డ్ రంగు చీరలో కీర్తి సురేష్.. ధగధగ మెరిసిన హీరోయిన్

Keerthy Suresh Siren Promotions: కీర్తి సురేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఈ హీరోయిన్ ఫోటోలు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి
 

  • Feb 16, 2024, 20:20 PM IST
1 /7

Keerthy Suresh in Saree: నేను శైలజా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కీర్తి సురేష్. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

2 /7

ముఖ్యంగా మహానటి సినిమా ఆమెకు తెలుగులో ఎంతోమంది అభిమానులను సంపాదించి పెట్టింది. ఈ చిత్రంకి గాని కీర్తి సురేష్ కి నంది అవార్డు సైతం వచ్చింది. 

3 /7

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సావిత్రి క్యారెక్టర్ లో కనిపించి కీర్తి సురేష్ అందరిని మెస్మరైజ్ చేసింది.

4 /7

 కాగా ఈ చిత్రం తర్వాత ఎన్నో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటించింది కీర్తి సురేష్. కానీ అవేవీ ఆమెకు పెద్దగా సక్సెస్ తెచ్చి పెట్టలేదు.

5 /7

ఇక ఈమధ్య వరసగా ఫ్లాపులతో సతమతమైన కీర్తి సురేష్ కి నానితో చేసిన దసరా సినిమా సూపర్ హిట్ అందించింది.

6 /7

కాగా ఇప్పుడు తెలుగు తమిళ భాషలలో జయం రవి చిత్రం సైరన్ తో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ అండ్ గోల్డ్ శారీలో కనిపించి కీర్తి సురేష్ అందరి దృష్టిని ఆకట్టుకుంది.

7 /7

ఈ చీరలో కీర్తి సురేష్ ఎంతో అందంగా కనిపిస్తూ.. జయం రవితో అలానే సినిమా యూనిట్ తో ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి