Viral video: జిమ్​ చేస్తూ ప్రాణాలు వదిలిన మహిళ- అచ్చం అప్పు లానే..!

Viral video: జిమ్​ చేస్తే ఫిట్​గా ఉంటారని.. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారని తరచూ వింటుంటాం. అయితే ఇటీవలి కాలంలో జిమ్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా బెంగళూరులో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్​ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 27, 2022, 05:16 PM IST
  • జిమ్​లో వర్కౌట్ చేస్తూ మహిళ మృతి
  • బెంగళూరులో చోటు చేసుకున్న ఘటన
  • అచ్చం పునీత్ రాజ్​ కుమార్​ లానే..
Viral video: జిమ్​ చేస్తూ ప్రాణాలు వదిలిన మహిళ- అచ్చం అప్పు లానే..!

Viral video: ఇటీవలి కాలంలో ఆరోగ్యవంతంగా, ఫిట్​గా ఉన్న వారు అకాల మృత్యువాత పడటం కలవరపెడుతోంది. గత ఏడాది కన్నడ పవర్​ స్టార్ పునీత్ రాజ్ కుమార్​ మరణమే ఇందుకు ఉదాహరణ. ఎంతో ఫిట్​గా, ప్రతి రోజు వ్యాయామం చేసే ఆయన.. గుండెపోటుతో మృతి చెందటం ఇంకా నమ్మలేకపోతున్నారు అభిమానులు.

అయితే ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చోసుకుంటుండటం మరింత ఆందోలన కలిగిస్తున్న విషయం. ముఖ్యంగా 30-50 ఏళ్ల లోపు వ్యక్తకులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలిస్తుండటం ఇటీవలికాలంలో ఎక్కువగా కనిపిస్తోంది.

తాజాగా బెంగళూరులో ఓ 35 ఏళ్ల మహిళ జిమ్​లో వర్కౌట్స్​ చేస్తూ ప్రాణాలు వదిలిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో బెంగళూరులోని బ్యాప్పనహల్లిలో ఓ జిమ్​లో.. అమె వ్యాయామం చేస్తున్న సమయంలోనే హార్ట్​ఎటాక్ రావడంతో ప్రాణాలు విడిచించింది. ఈ దృష్యాలు జిమ్​ సెంటర్​లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వీడియోను పబ్లిక్ స్పాట్​ అనే యూట్యూబ్ ఛానెల్ అప్లోడ్ చేసింది. అచ్చం పునిత్ రాజ్​ముమార్​ (అప్పు)కు జరిగినట్టే ఆ మహిళకు కూడా ఆ యూట్యూబ్ ఛానెల్​ డిస్క్రిప్షన్ రాసుకొచ్చింది.

ప్రముఖ వార్తా సంస్థ హిందుస్థాన్​ టైమ్స్​ ప్రకారం.. అమె పేరు వినయ విట్టల్​గా తెలిసింది. అమె ఐడీసీలో బ్యాగ్రౌండ్ ఆఫీసర్​గా పని చేస్తున్నట్లు వెల్లడైంది. అమె ప్రతి రోజూ జిమ్​ చేస్తుందని.. అలాంటి అమెకు ఇలా హార్ట్ ఎటాక్ రావడం కుటుంబ సభ్యులను షాక్​గు గురి చేసింది.

Also read: Desi Spiderman: దేశీ స్పైడర్ మ్యాన్ ను ఎప్పుడైనా చూశారా? అయితే ఇది చూడండి!

Also read: Viral Video: నడిరోడ్డులో ఈ-రిక్షా డ్రైవర్ ను కొట్టిన పోలీస్- వీడియో వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News