Desi Spiderman: దేశీ స్పైడర్ మ్యాన్ ను ఎప్పుడైనా చూశారా? అయితే ఇది చూడండి!

Desi Spiderman: మీరు నిజజీవితంలో స్పైడర్ మ్యాన్ ను ఎప్పుడైనా చూశారా? అయితే ఈ వీడియో చూడండి. మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 26, 2022, 03:23 PM IST
Desi Spiderman: దేశీ స్పైడర్ మ్యాన్ ను ఎప్పుడైనా చూశారా? అయితే ఇది చూడండి!

Desi Spiderman: సోషల్ మీడియాలో అనేక విచిత్రమైన వీడియోలు నిత్యం ట్రెండ్ అవుతున్నాయి. ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అని తేడా లేకుండా అనేక వీడియోలను నెట్టింట షేర్ చేస్తున్నారు. అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అందులో ఓ వీడియోను మీకు చూపబోతున్నాం. బురదమయంగా ఉన్న రోడ్డులో దాటేందుకు ఓ యువకుడు చేసిన పనిని చూస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. 

దేశీ స్పైడర్ మ్యాన్

వైరల్ గా మారిన వీడియో ప్రకారం.. ఓ యువకుడు సైకిల్ పై ఏవో వస్తువులను తీసుకెళ్తున్నట్లు ఉంది. అయితే అతడు వెళ్లే దారి నుంచి బురద, నీరు ఉన్నాయి. అయితే బురదలో నడిచేందుకు ఇష్టపడని ఆ వ్యక్తి విన్నూత్నంగా ఆలోచించాడు. సైకిల్ పై తన మొండాన్ని వాలుస్తూ.. కాళ్లు పక్కన ఇంటి గోడలపై పెట్టి.. సైకిల్ ను ముందుకు కదపసాగాడు. అలా ఆ బురద రోడ్డు దాటే వరకు అలా ఇంటి గోడలపై నడుచుకుంటూ వెళ్లాడు. 

బురదను దాటుకునేందుకు యువకుడు చేసిన సాహసానికి గానూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అతడిని 'దేశీ స్పైడర్ మ్యాన్' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దాదాపు 15 సెకన్ల నిడివి కలిగి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారిణి స్వాతి లక్రా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.  

Also Read: Viral Video: నడిరోడ్డులో ఈ-రిక్షా డ్రైవర్ ను కొట్టిన పోలీస్- వీడియో వైరల్!

Also Read: Dog Volleyball: మనుషుల్లా వాలీబాల్ ఆడుతున్న వీధి శునకాలు.. వీడియో వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News