Dhanteras Significance: దంతేరస్ నాడు ఆ వస్తువు తప్పకుండా కొనాల్సిందే, అలా చేస్తే ఏమౌతుంది

Dhanteras Significance: హిందూమతంలో దంతేరస్‌కు ఓ ప్రత్యేక ప్రాధాన్యత, మహత్యమున్నాయి. అందుకే దంతేరస్ నాడు చేసే పనికి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ఆ మెటల్ కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మీ సొంతం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 9, 2022, 10:42 PM IST
Dhanteras Significance: దంతేరస్ నాడు ఆ వస్తువు తప్పకుండా కొనాల్సిందే, అలా చేస్తే ఏమౌతుంది

Dhanteras Significance: దీపావళి ఉత్తరాదిన ఐదు రోజులపాటు నిర్వహిస్తారు. దక్షిణాదిన సంక్రాంతి, దసరాకు ఉన్న ప్రాధాన్యత ఉత్తరాదిన దీపావళికి ఉంటుంది. ఐదు రోజుల దీపావళి వేడుకలో తొలిరోజు దంతేరస్. ఈ రోజున చేసే ఓ ముఖ్యమైన పనితో లక్ష్మీదేవి కటాక్షానికి కారణమౌతుంది. 

ఐదురోజుల దీపావళి వేడుక ప్రారంభం దంతేరస్‌తో అవుతుంది. దంతేరస్ అనేది లక్ష్మీదేవి పూజలతో పాటు యముడు, ధన్వంతరి పూజలకు కూడా ప్రత్యేక రోజు. చాలామంది దంతేరస్ రోజుని కొనుగోళ్లకే పరిమితం చేస్తారు. ఈ రోజున ఆభరణాలు, గిన్నెలు కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తారు. దాంతోపాటు ధన్వంతరి, యముడికి కూడా పూజలు చేయాల్సి ఉంటుంది. ఈ ఇద్దరి పూజ చేయకపోతే ఆ పూజ అసంపూర్ణమవుతుంది. 

దంతేరస్ నాడు తప్పకుండా ఇది కొనాలి

దంతేరస్ నాడు ఐశ్వర్యం, ప్రసన్నత కోసం లక్ష్మీదేవి ముద్ర ఉన్న వెండి గిన్నెలు కొనాలి. వాటిని ఇంటికి తీసుకొచ్చి..పూజలు చేయాలి. అంటే గణేశ్, శంకరుడు, దుర్గాదేవి, విష్ణువు, సూర్యుడికి గంధం, పూలు, ధూపం, దీపం, నైవేద్యంతో పూజలు చేయాలి. దంతేరస్ నాడు వెండితో చేసిన గిన్నెలు లేదా వస్తువులు కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమౌతుంది. కలకాలం ఉంటుంది. ఎందుకంటే వెండిలో లక్ష్మీదేవి ఆవాసముంటుంది. అందుకే వెండి వస్తువుల కొనుగోలుపై విశిష్టత ఉంటుంది. వెండితో పాటు బంగారు ఆభరణాలు కూడా కొనాలి.

యముడి పూజ మర్చిపోకూడదు

దంతేరస్ నాడు పూర్తి భక్తిశ్రద్ధలతో యముడికి పూజలు చేయాలి. ఈ రోజున వ్రతం ఆచరిస్తే అద్భుత మహత్యముంది. సాయంత్రం వేళ ఇంటి ముఖద్వారంపై పిండి పళ్లెంలో నాలుగు ముఖాల దీపం ఉంచాలి. ఇంటి దక్షిణభాగంలో దక్షిణంవైపుకు తిరిగి దీపదానం చేయాలి. దంతేరస్ నాడు యముడి ప్రసన్నత కోసం యమునా నదిలో స్నానం చేయాలి.

యమునా నది స్నానం తరువాత దీపదానం చేసేవారెప్పుడూ ఆకస్మికంగా మరణించరు. యమునా నదిలో స్నానం చేయకపోతే ఇంట్లోనే యమునను స్మరించుకుని స్నానం చేయాలి. యముడు, యుమన ఇద్దరూ సూర్యుడి సంతానం. అందుకే ఇద్దరు అన్నాచెల్లెళ్ల మధ్య అమితమైన ప్రేమ ఉంటుంది. యమున పూజచేసేవారికి యముడు ప్రసన్నుడౌతాడు. 

Also read: Shanidev Margi 2022: ధంతేరాస్ రోజు శనిదేవుడి కదలిక... ఈ 4 రాశులవారి కెరీర్ కేక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News