Shani Vakri 2024: రివర్స్ లో నడవనున్న శని.. ఈ 3 రాశులకు మనీ మనీ మోర్ మనీ..

Shani Vakri 2024: పురాణాల ప్రకారం, శనిదేవుడు సూర్యదేవుని పుత్రుడు. శనిదేవుడి కదలికలో చిన్న మార్పు కూడా ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. త్వరలో శని గ్రహం తిరోగమనం చెందబోతున్నాడు. ఇది మూడు రాశులవారికి బంపర్ బెనిఫిట్స్ అందించబోతుంది.   

Written by - Samala Srinivas | Last Updated : May 2, 2024, 07:30 PM IST
Shani Vakri 2024: రివర్స్ లో నడవనున్న శని.. ఈ 3 రాశులకు మనీ మనీ మోర్ మనీ..

Saturn retrograde in Aquarius 2024: హిందువులు శనిదేవుడును కర్మ ప్రదాత అని అంటుంటారు. శని వక్ర దృష్టి ఎవరి పడుతుందో వారి జీవితం క్షణాల్లో నాశనమవుతుంది. అలాంటి శనిదేవుడు త్వరలో తిరోగమనం చెందనున్నాడు. ఇది కూడా తన సొంతరాశి చక్రం అయిన కుంభరాశిలో. శని గ్రహం యెుక్క ఈ రివర్స్ కదలిక శష్ మహాపురుష రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఈ అరుదైన రాజయోగం కారణంగా కొందరి జీవితాలు మలుపు తిరగబోతున్నాయి. ఆ లక్కీ రాశిచక్రాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి. 

వృశ్చిక రాశి
కుంభరాశిలో శనిదేవుడు తిరోగమనం వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీరు భారీగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారం వృద్ధి చెందడంతోపాటు ఇంతకముందు ఎప్పుడూ చూడని లాభాలను పొందుతారు. జాబ్ చేసేవారికి శాలరీ పెరగడంతోపాటు పదోన్నతి కూడా లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు లగ్జరీ కారు లేదా బైక్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. 
సింహరాశి
సింహరాశి వారికి శనిదేవుడి కటాక్షం ఉంటుంది. మీ దాంపత్య జీవితం కలతలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా మంచి పొజిషన్ లో ఉంటారు. డబ్బును పొదుపు చేస్తారు. ఆఫీసులో మీ బాస్ మిమ్మల్ని పొగుడుతాడు. మీ సంపద గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీగా వృద్ధి చెందుతుంది. కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. మీ కెరీర్ ఊహించని మలుపు తిరుగుతోంది. 

Also Read: Mercury transit 2024: త్వరలో ఈ 3 రాశులవారిని బుధుడు ధనవంతులు చేయబోతున్నాడు.. మీది ఉందా?

కుంభ రాశి
ఇదే రాశిలో శని గ్రహం తిరోగమనం చెందబోతున్నాడు. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడుతుంది. మీ దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. ఆర్థికంగా స్థిరపడతారు. మీరు సమాజంలో మంచి పొజిషన్ లో ఉంటారు. మీరు కెరీర్ లో కోరుకున్న స్థాయికి వెళతారు. ఉద్యోగ, వ్యాపారులకు ఈ సమయం కలిసి వస్తుంది. 

Also Read: Swapna Shastra: మీకు నిద్రలో అలా జరిగినట్లు కల వచ్చిందా.. గొప్ప అదృష్ట యోగం.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News