ఆసియా కప్ 2018 ఇండియా vs హాంగ్ కాంగ్: టాస్ గెలిచిన హాంగ్ కాంగ్

ఆసియా కప్ 2018 ఇండియా vs హాంగ్ కాంగ్

Last Updated : Sep 20, 2018, 04:39 PM IST
ఆసియా కప్ 2018 ఇండియా vs హాంగ్ కాంగ్: టాస్ గెలిచిన హాంగ్ కాంగ్

ఆసియా కప్ 2018 పోటీల్లో భాగంగా నేడు మొదటి మ్యాచ్ ఆడుతున్న టీమిండియా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా హాంగ్ కాంగ్‌తో తలపడుతోంది. ఇందులో భాగంగానే టాస్ గెలిచిన హాంగ్ కాంగ్ కెప్టెన్ అన్షుమన్ రత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్న ఈ ఆటలో టీమిండియా తరపున రోహిత్ శర్మ (కెప్టేన్), శిఖర్ ధవన్, అంబటి రాయుడు, దినేష్ కార్తిక్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), భువనేశ్వర్ కుమార్, శార్ధూల్ థాకూర్, ఖలీల్ అహ్మెద్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ఆడుతున్నారు. 

ఇక హాంగ్ కాంగ్ జట్టు విషయానికొస్తే, అన్షుమన్ రత్ (కెప్టేన్), నిజకత్ ఖాన్, బాబర్ హయత్, క్రిష్టోఫర్ కార్టర్, కించిత్ షా, ఐజాజ్ ఖాన్, స్కాట్ మెక్‌కెంచీ (వికెట్ కీపర్), తన్వీర్ అఫ్జల్, ఎహ్‌సాన్ ఖాన్, ఎహ్‌సాన్ నవాజ్, నదీమ్ అహ్మెద్ జట్టు సభ్యులుగా ఉన్నారు.

Trending News