కామన్వెల్త్ వేదికగా ప్రపోజ్ చేశాడు

కామన్వెల్త్ క్రీడల్లో ఆదివారం ఆసక్తికర దృశ్యం.

Last Updated : Apr 9, 2018, 04:20 PM IST
కామన్వెల్త్ వేదికగా ప్రపోజ్ చేశాడు

గోల్డ్ కోస్ట్: కామన్వెల్త్ క్రీడల్లో ఆదివారం ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఇద్దరు బాస్కెట్‌బాల్‌ క్రీడాకారులు తమ జీవితాల్లో మరిచిపోలేని వేడుకకు కామన్వెల్త్ క్రీడలను వేదికగా చేసుకున్నారు.

ఇంగ్లాండ్ బాస్కెట్‌బాల్‌ ఆటగాడు జామెల్ ఆండర్సన్.. తమ దేశ మహిళల బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి జార్జియా జోన్స్‌కు కోర్టులోనే పెళ్లి ప్రతిపాదన చేశాడు. పురుషుల జట్టు సభ్యుడు అండర్సన్ మహిళా జట్టు సభ్యురాలు జోన్స్‌కు  సినిమాను తలపించేలా మోకాలిపై కూర్చుని ప్రపోజ్ చేశాడు. అయితే ఈ సంఘటనతో ఆరంభంలో షాక్‌కు గురైన జార్జియా.. ఆ తరువాత తేరుకొని అతని ప్రతిపాదనకు అంగీకరించింది. జోన్స్ అంగీకరించడంతో తోటి క్రీడాకారుల సమక్షంలో ఆమెకు ఎంగేజ్‌మెంట్‌ ఉంగరం తొడిగి అండర్సన్ భావోద్వేగానికి గురయ్యాడు. కామెరూన్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది.

కామన్వెల్త్‌ వేదికగా జరిగిన వీరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోను ఇంగ్లండ్‌ బాస్కెట్‌బాల్‌ టీమ్‌ తమ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు క్రీడాకారులు వీరికి బెస్ట్‌ విషెస్‌ చెబుతున్నారు.

Trending News