Asia Cup 2022: ఆసియా కప్‌ ఆ జట్టే గెలుస్తుంది.. షేన్ వాట్సన్‌ జోస్యం!

Shane Watson about Winner of India vs Pakistan match and Asia Cup 2022. ఆసియా కప్ 2022, భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్ వాట్సన్‌ స్పందించాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 25, 2022, 11:14 AM IST
  • 28న మెగా మ్యాచ్
  • భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌లో గెలుపు ఎవరిది
  • షేన్ వాట్సన్‌ జోస్యం
Asia Cup 2022: ఆసియా కప్‌ ఆ జట్టే గెలుస్తుంది.. షేన్ వాట్సన్‌ జోస్యం!

Shane Watson says India to win Asia Cup 2022: ఆసియా కప్ 2022 టోర్నీకి సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో మెగా టోర్నీకి తెరలేవనుంది. ఆగస్టు 27న ఆసియా కప్ ఆరంభం కానుండగా.. తొలి మ్యాచులో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. 28న దాయాదీ దేశాలు భారత్, పాకిస్థాన్ ఢీ కొట్టనున్నాయి. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇండో-పాక్ తలపడుతుండడంతో.. ఈ  మ్యాచ్‌కు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ హైవోల్టెజీ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందని, ఆసియా కప్‌ ఏ జట్టు గెలుస్తుందని విశ్లేషణలు మొదలయ్యాయి.

ఆసియా కప్ 2022, భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్ వాట్సన్‌ స్పందించాడు. ఆసియా కప్‌ 2022లో భారత్‌ విజేతగా నిలుస్తోందని వాట్సన్‌ జోస్యం చెప్పాడు. 'ఆసియా కప్‌ 2022లో భారత్ ఛాంపియన్‌గా నిలుస్తోందని భావిస్తున్నా. ప్రస్తుతం భారత జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ప్రతిఒక్కరు బాగా ఆడుతున్నారు. అదే విధంగా యూఏఈ పరిస్థితులకు అనుగుణంగా ఆడే సత్తా టీమిండియాకు ఉంది. భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ కూడా బలంగా ఉంది' అని వాట్సన్‌ అన్నాడు. 

'భారత్-పాకిస్తాన్ మ్యాచ్ చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాను ఓడించగలమని పాకిస్తాన్ జట్టు పూర్తి నమ్మకంగా ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టే ఆసియా కప్‌ను కూడా కైవసం చేసుకుంటుందని నేను భావిస్తున్నా' అని షేన్ వాట్సన్‌ తెలిపారు. మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతోంది. ఆసియా కప్‌లో టీమిండియాకు మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఈ మెగా ఈవెంట్‌లో భారత్ 7 సార్లు ఛాంపియన్స్‌గా నిలిచింది. 

Also Read: Gold Price Today: పెరిగిన పసిడి ధర.. హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలివే..

Also Read: Ganesh Chaturthi 2022: వినాయకుడి ఫేవరెట్ రాశులేంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News