Gold Price Today: పెరిగిన పసిడి ధర.. హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలివే..

బంగారం ధర మళ్లీ పెరిగింది. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 మేర, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.320 మేర ధర పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,550గా ఉంది.  హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 25, 2022, 08:06 AM IST
  • పెరిగిన బంగారం ధరలు
  • 22 క్యారెట్ల 10గ్రా. బంగారంపై రూ.250 మేర పెరిగిన ధర
  • 24 క్యారెట్ల 10గ్రా. బంగారంపై రూ.320 మేర పెరిగిన ధర
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరల వివరాలివే
Gold Price Today: పెరిగిన పసిడి ధర.. హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలివే..

Gold Price Today August 25th 2022 : బంగారం ధర మళ్లీ పెరిగింది. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 మేర, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.320 మేర ధర పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,550గా ఉంది.  హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధరలు:

తెలుగు రాష్ట్రాల్లోని  ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. హైదరాబాద్ సహా ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,550గా ఉంది. 

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,710గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,550గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,420గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600గా ఉంది.

మహారాష్ట్రలోని పుణే, గుజరాత్‌లోని వడోదరా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,280 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,580గా ఉంది. 

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250గా ఉంది. 24  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,550గా ఉంది.

గడిచిన 10 రోజుల్లో బంగారం ధర ఐదుసార్లు తగ్గింది.  కేవలం ఒక్కసారి మాత్రమే పెరిగింది. ఆగస్టు 24న రూ.700 మేర ధర దిగి రావడంతో పసిడి ప్రియులు సంబరపడ్డారు. మొత్తంగా ఈ 10 రోజుల్లో 1300 మేర దిగొచ్చిన ధర కేవలం రూ.320 మాత్రమే పెరిగింది. పెరిగిన ధరతో పోలిస్తే.. అంతకు దాదాపు మూడు రెట్లు ఈ వారంలో ధర తగ్గింది. బంగారంపై జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా వివిధ నగరాల్లోని బంగారం ధరల్లో తేడాలు ఉండొచ్చు. అంతర్జాతీయ మార్కెట్, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, డాలరుతో రూపాయి మారకం విలువ, దేశాల మధ్య సంబంధాలు తదితర అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయి.

Also Read: Liger Twitter Review: ప్రేక్షకుల ముందుకొచ్చేసిన విజయ్ దేవరకొండ 'లైగర్'.. సినిమాపై ట్విట్టర్‌ రివ్యూ ఇదే..  

Also Read: Horoscope Today August 25th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News