IND vs PAK Test: భారత్-పాకిస్థాన్ టెస్టు మ్యాచ్‌.. బీసీసీఐ కీలక నిర్ణయం! పీసీబీకి దిమ్మదిరిగిపోలా

BCCI deny plans for India-Pakistan Test match anywhere says source. భారత్‌-పాకిస్తాన్ టెస్టు మ్యాచ్‌ గురించి బీసీసీఐ ఆలోచించడం లేదని సంబంధింత వర్గాలు స్పష్టం చేశాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 30, 2022, 08:38 PM IST
  • భారత్-పాకిస్థాన్ టెస్టు మ్యాచ్‌
  • బీసీసీఐ కీలక నిర్ణయం
  • పీసీబీకి దిమ్మదిరిగిపోలా
IND vs PAK Test: భారత్-పాకిస్థాన్ టెస్టు మ్యాచ్‌.. బీసీసీఐ కీలక నిర్ణయం! పీసీబీకి దిమ్మదిరిగిపోలా

BCCI have no plans to conduct India-Pakistan Test series anywhere: మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతుందని సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ మరియు విక్టోరియన్ ప్రభుత్వం కూడా ఆతిథ్యం ఇవ్వడం గురించి క్రికెట్ ఆస్ట్రేలియాతో అనధికారిక సంప్రదింపులు చేశాయట. అయితే ఈ టెస్ట్ మ్యాచ్‌కి సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఓ కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు టెస్ట్ మ్యాచ్ నిర్వహించే ఉద్దేశం లేదని, భవిష్యత్తులోనూ అలంటి ప్రణాళిక లేదని పేర్కొంది. 

2022 అక్టోబరులో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్ విజయవంతమైన విషయం తెలిసిందే. చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ అనూహ్య విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ని చూసేందుకు 90,293 మంది అభిమానులు స్టేడియానికి వచ్చారు. ఇక ఓటీటీ రేటింగ్స్ అయితే బద్దలు అయిపోయాయి. దాంతో ఇరు జట్ల మధ్య తటస్థ వేదికలో టెస్ట్‌లను నిర్వహించాలని మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ మరియు విక్టోరియా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాయి. ఎంసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టువర్ట్ ఫాక్స్ క్లబ్‌తో పాటు విక్టోరియన్ ప్రభుత్వం టెస్ట్‌లను నిర్వహించడం గురించి క్రికెట్ ఆస్ట్రేలియాని అడిగినట్లు వెల్లడించారు.

భారత్‌-పాకిస్తాన్ టెస్టు మ్యాచ్‌ గురించి బీసీసీఐ ఆలోచించడం లేదని సంబంధింత వర్గాలు స్పష్టం చేశాయి. 'ప్రస్తుతం ఏ దేశంలోనైనా భారత్‌-పాక్‌ టెస్టు సిరీస్‌ నిర్వహించే ఉద్దేశం మాకు లేదు. భవిష్యత్తులో కూడా ఎలాంటి ప్రణాళికలు లేవు. ఎవరికైనా ఇలాంటి ఆలోచనలు ఉంటే.. అవి మీ వద్దే పెట్టుకోండి' అని ఓ జాతీయ మీడియాతో బీసీసీఐ సంబంధింత వర్గాలు పేర్కొన్నాయి. ఐసీసీ టోర్నీల్లో వన్డేలు, టీ20ల్లో మాత్రమే దాయాది దేశాలు తలపడుతున్న విషయం తెలిసిందే. 

2023-2027 భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళిక (ఎఫ్‌టీపీ)లో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లకు అవకాశం లేదు. ఆసియా కప్‌ 2023 టోర్నీకి పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇవ్వబోతోంది. అలానే వన్డే ప్రపంచకప్‌ 2023కి భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. కానీ ఇరుజట్ల పర్యటన గురించి ఇంతవరకూ ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తత కారణంగా చాలా కాలంగా ఇరు జట్ల మధ్య ఏ క్రికెట్ సిరీస్ జరగలేదు. 2007లో ఇరు జట్ల మధ్య చివరి టెస్టు మ్యాచ్ జరిగింది. ఇక చివరి సిరీస్ 2012లో జరిగింది. 

Also Read: న్యూ ఇయర్ 2023 ఆంక్షలు.. హైదరాబాద్ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

Also Read: Rishabh Pant Car Accident: మన్సూర్ పటౌడీ నుంచి ఆండ్రూ సైమండ్స్ వరకు.. రోడ్డు ప్రమాదంకు గురైన క్రికెటర్లు వీరే!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News