Vijay Shankar: ఓ ఇంటివాడు కాబోతున్న భారత ఆల్ రౌండర్

భారత మరో క్రికెటర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తమిళనాడుకు చెందిన ప్రముఖ భారత ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ( Vijay Shankar ) గురువారం సోషల్ మీడియాలో తన ఎంగేజ్‌మెంట్ అయినట్లు ప్రకటించాడు.

Last Updated : Aug 21, 2020, 12:15 PM IST
Vijay Shankar: ఓ ఇంటివాడు కాబోతున్న భారత ఆల్ రౌండర్

India all-rounder Vijay Shankar Engagement: భారత మరో క్రికెటర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తమిళనాడుకు చెందిన ప్రముఖ భారత ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ( Vijay Shankar ) గురువారం సోషల్ మీడియాలో తనకు ఎంగేజ్‌మెంట్ (Vijay Shankar Engagement) అయినట్లు ప్రకటించాడు. విజయ్ శంకర్ తనకు కాబోయే భార్య వైశాలి విశ్వేశ్వరన్‌తో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ రింగ్ ఎమోజీని జతచేశాడు. దీంతో ఆయనకు సహచర క్రీడాకారుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. Vijay Shankar Engagement Photos: వేడుకగా క్రికెటర్ విజయ్ శంకర్ నిశ్చితార్థం

విజయ్ శంకర్ చేసిన ఎంగేజ్‌మెంట్ వివరాల పోస్ట్‌కు కెఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్, శ్రేయాస్ అయ్యర్, కరుణ్ నాయర్ సహా పలువురు క్రికెటర్లు విజయ్ శంకర్ జోడికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలాఉంటే..  ఇటీవలనే మరో క్రికెటర్‌ యుజువేంద్ర చాహల్‌ సైతం ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. Also read: Fire Accident: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

💍 PC - @ne_pictures_wedding

A post shared by Vijay Shankar (@vijay_41) on

ఇదిలాఉంటే.. తమిళనాడుకు చెందిన శంకర్ 2018లో కొలంబోలో శ్రీలంకతో జరిగిన టీ-20 మ్యాచ్ నుంచి భారత్ తరపున అరంగేట్రం చేశాడు. అప్పటినుంచి శంకర్ భారత్ తరపున 12 వన్డేలు, తొమ్మిది టీ 20 మ్యచ్‌లు ఆడాడు. 2019 ఐసీసీ ప్రపంచ కప్ కోసం ఇండియా జట్టులో ఎంపికయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL ) 2020లో శంకర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడనున్నాడు. Chittoor Gas Leak: చిత్తూరు గ్యాస్ లీకేజీ కలకలం

Trending News