Fire Accident: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో గురువారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెలంగాణ ఎడమగట్టు భూగర్భ విద్యుత్ జల కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణకు చెందిన నాలుగో యూనిట్‌ టెర్మినల్‌లో షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.

Last Updated : Aug 21, 2020, 08:20 AM IST
Fire Accident: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Short circuit in Srisailam left hydroelectric power project: హైదరాబాద్: శ్రీశైలం ( Srisailam ) జల విద్యుత్ కేంద్రంలో గురువారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెలంగాణ శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ విద్యుత్ జల కేంద్రం (Srisailam power project ) లో ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణకు చెందిన నాలుగో యూనిట్‌ టెర్మినల్‌లో షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద పెద్ద పేలుళ్లు సంభవించి ఆరు యూనిట్లల్లో పోగ అలుముకుంది. శబ్దాలతో కొంతమంది సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదం సంభవించినప్పుడు లోపల 17మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 9 మంది సిబ్బంది లోపలే చిక్కుకుపోయారని పేర్కొంటున్నారు. మిగతా వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు విఘాతం కల్గుతోంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని జెన్కో ఆసుపత్రికి తరలించారు.  Chittoor Gas Leak: చిత్తూరు గ్యాస్ లీకేజీ కలకలం

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళగంగ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హుటాహుటిన ఘటనస్థలానికి చేరుకోని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదిలాఉంటే.. లోపల చిక్కుకున్న వారి పరిస్థితి తెలియకపోవడంతో.. వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన మరింత తీవ్రమైంది.  Also read: Chennai Customs: కొరియర్ లో విదేశీ కరెన్సీ..చెన్నైలో పట్టివేత

Trending News