ఆసియా కప్: బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం

ఆసియా కప్‌లో భారత్ మరోసారి దూసుకుపోయింది. రోహిత్‌ శర్మ (83 నాటౌట్‌; 104 బంతుల్లో) తన బ్యాటింగ్‌తో వీరవిహారం చేయడంతో భారత్ విజయాన్ని సాధించింది.

Last Updated : Sep 22, 2018, 02:17 PM IST
ఆసియా కప్: బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం

ఆసియా కప్‌లో భారత్ మరోసారి దూసుకుపోయింది. రోహిత్‌ శర్మ (83 నాటౌట్‌; 104 బంతుల్లో) తన బ్యాటింగ్‌తో వీరవిహారం చేయడంతో భారత్ విజయాన్ని సాధించింది. తన స్టైలిష్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న రోహిత్ అభిమానుల మనసులనూ దోచుకున్నాడు. హాఫ్ సెంచరీ చేసినా.. ఎప్పటికీ గుర్తుంచుకొనే ఆట ఆడాడు. రోహిత్‌కి తోడుగా శిఖర్ ధావన్‌ కూడా రెచ్చిపోయి ఆడడంతో బంగ్లాదేశ్‌తో ఆడిన తొలి సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. అంతకు మందుకు బంగ్లాదేశ్ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్ల తేడాతో పూర్తి చేసింది.

13.4 ఓవర్లు మిగిలి ఉండగానే గేమ్ పూర్తి చేసిన భారత్ విజయతీరాలను చేరింది. ఒకానొక సందర్భంలో ఎంఎస్‌ ధోనీ (33; 37 బంతుల్లో 3×4) కూడా రోహిత్‌కు తోడుగా నిలిచి మ్యాచ్‌ను రక్తి కట్టించారు. బౌలర్లలో అప్పటికే జడేజా (4 వికెట్లు), భువి (3 వికెట్లు), బుమ్రా (3 వికెట్లు) తీయడంతో బంగ్లాదేశ్ తీవ్రమైన కష్టాల్లో చిక్కుకుపోయింది. బంగ్లా బ్యాట్స్‌మన్‌లో మెహది హసన్‌ (42 పరుగులు), మొర్తజా (26 పరుగులు) మాత్రమే కొంతలో కొంత నయం అనిపించారు.
 
భారత్ తన బ్యాటింగ్ మొదలుపెట్టగానే హిట్టింగ్ ప్రారంభించింది. ధావన్‌ రెచ్చిపోయి ఆడుతూ... రోహిత్‌‌తో కలిసి సరైన రీతిలో సమన్వయం చేశాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు కలిసి తొలి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యంతో ఆరంభంలోనే మంచి పునాది వేశారు. అయితే హాఫ్ సెంచరీకి  చేరువైన ధావన్ 14.2వ బంతికి షకిబ్‌కి దొరికిపోవడంతో కొంత గందరగోళం ఏర్పడింది. కానీ రోహిత్‌ ఫోర్లు, సిక్సర్లతో అలరించడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తనదైన శైలిలో స్టైలిష్ సిక్సర్ కొట్టి హాఫ్ సెంచరీ కూడా చేశాడు రోహిత్.

Trending News