India vs Ireland: రేపే టీమిండియా, ఐర్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్‌.. తుది జట్టు ఇదే..!

India vs Ireland: క్రికెట్ అభిమానులకు మరో పండుగ వచ్చింది. రేపటి నుంచి టీమిండియా, ఐర్లాండ్ మధ్య రెండు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుంది.

Written by - Alla Swamy | Last Updated : Jun 25, 2022, 04:01 PM IST
  • క్రికెట్ అభిమానులకు మరో పండుగ
  • రేపటి నుంచి టీమిండియా, ఐర్లాండ్ టీ20 సిరీస్‌
  • హార్దిక్ పాండ్య సారధ్యంలో భారత్‌
India vs Ireland: రేపే టీమిండియా, ఐర్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్‌.. తుది జట్టు ఇదే..!

India vs Ireland: క్రికెట్ అభిమానులకు మరో పండుగ వచ్చింది. రేపటి నుంచి టీమిండియా, ఐర్లాండ్ మధ్య రెండు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుంది. సిరీస్‌లో భారతే ఫేవరేట్‌ అయినా..ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేయకూడదు. ఇటీవల ఆ జట్టు సైతం బాగా పుంజుకుంది. డబ్లిన్ వేదికగా రాత్రి 9 గంటలకు తొలి టీ20 మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. టీమిండియాను ఆల్‌రౌండర్‌ హార్ధిక్ పాండ్య నడిపించనున్నాడు. కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ సేవలందించనున్నాడు. ఇద్దరికి ఇదే తొలి సిరీస్‌ కావడంతో రేపటి మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది.

ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌ ముగిసింది. ఇరు జట్లు రెండేసి మ్యాచ్‌ల్లో గెలిచాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో సఫారీ జట్టు విజయ ఢంకా మోగించింది. ఈసమయంలో అద్భుతంగా ఫుంజుకున్న యువ భారత్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసింది. సిరీస్‌ను సమం చేసింది. ఐతే ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌ వర్షం వల్ల రద్దు అయ్యింది. ఇదే జోష్‌తో ఐర్లాండ్‌ సిరీస్‌కు భారత్‌ సిద్ధమవుతోంది. ఇప్పుడున్న ఆటగాళ్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు.

ఇదే జట్టును ఐర్లాండ్‌ మ్యాచ్‌లో ఆడించే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ల్లో జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పుడు కూడా అదే జట్టు ఆడే అవకాశం ఉందని క్రికెట్ పండితులు చెబుతున్నారు. ఓపెనర్ ఇషాన్ కిషన్, మిడిల్‌ ఆర్డర్‌లో హార్థిక్ పాండ్య, దినేష్ కార్తీక్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లోనూ భారత్‌ అద్భుతంగా ఉంది. సౌతాఫ్రికా జరిగిన మ్యాచ్‌ల్లో భువనేశ్వర్‌ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. హర్షల్ పటేల్‌, అవేష్‌ ఖాన్‌ సైతం టచ్‌లో ఉన్నారు. చాహల్ సైతం తన మాయను చూపిస్తున్నాడు.

గత దక్షిణాఫ్రికా సిరీస్‌లో బెంచ్‌కే పరిమితం అయిన ఆటగాళ్లను ఆడించాలని క్రికెట్ పండితులు చెబుతున్నారు ఉమ్రాన్ మాలిక్ అరంగేట్రంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీపక్ హూడా, వెంకటేష్‌ అయ్యర్, అర్షదీప్‌ సింగ్, బిష్ణోయ్‌ తుది జట్టులోకి తీసుకోవాలంటున్నారు. ఐపీఎల్‌లో గాయపడి జట్టుకు దూరంగా ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం కోలుకున్నాడు. ఐర్లాండ్ సిరీస్‌లో ఆడే అవకాశం ఉంది. సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి సైతం జట్టుకు అందుబాటులో ఉన్నారు. వీరిని ఆడిస్తే బాగుంటుందన్న వాదన ఉంది.

ఇటు ఐర్లాండ్ సైతం మంచి ఫామ్‌లో ఉంది. ఇటీవల ఒమన్‌లో 2022 టీ20 ప్రపంచకప్‌ క్వాలిఫయర్ టోర్నీ ముగిసింది. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో ఆడిన ఆ జట్టు రెండింట్లో గెలుపు రుచి చూసింది. దీంతో సెమీఫైనల్‌కు అర్హత పొందింది. ఆ జట్టు ఆటగాల్లు హర్రీ టెక్టార్, పాల్ స్టిర్లింగ్, గ్రేత్ డెన్లీ, కెప్టెన్ ఆండ్రూ బల్‌బిర్ని అద్భుత ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో క్రెగ్ యంగ్ ఆకట్టుకుంటున్నాడు.

Also read: India Vs Ireland: వికెట్‌ కీపర్‌గా సంజూ, ఇషాన్‌ వద్దు.. అతడే సరైనోడు: గవాస్కర్

Also read: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో బలంగా వీస్తున్న నైరుతి గాలులు..లెటెస్ట్ వెదర్‌ రిపోర్ట్‌ మీ కోసం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News