Rohan Gavaskar choose Dinesh Karthik as a Wicket: ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు రెండు దేశాలలో పర్యటిస్తోంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ఓ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుండగా.. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని మరో జట్టు ఐర్లాండ్‌లో ఉంది. హార్దిక్ జట్టు ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఆదివారం నుంచి ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టులో చాలా మంది కొత్త ప్లేయర్స్, సీనియర్లు చోటు దక్కించుకున్నారు.
గాయం కారణంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమైన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐర్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2022, దక్షిణాఫ్రికా సిరీస్‌లో అదరగొట్టిన సీనియర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ చోటు దక్కించుకున్నాడు. రాహుల్ త్రిపాఠికి తొలిసారిగా బీసీసీఐ సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. ఐపీఎల్ 2022లో ఆకట్టుకున్న కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ కూడా భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇషాన్ కిషన్ కూడా ఉండడంతో ప్రస్తుతం కీపర్ రేస్ రసవత్తరంగా ఉంది.
భారత తుది జట్టు కూర్పుపై పలువురు మాజీ క్రికెటర్లు తమ తమ అభిప్రాయాలు చెబుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భారత మాజీ ఆటగాడు రోహన్ గవాస్కర్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో ఎవరిని వికెట్ కీపర్‌గా ఎంచుకుంటారని అడగ్గా.. 'వికెట్ కీపర్లుగా దినేశ్ కార్తిక్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్లకు తమకంటూ ప్రత్యేక స్థానం ఉంది. అయితే నేను మాత్రం శాంసన్, ఇషాన్ తుది జట్టులో ఉన్నా.. కార్తిక్‌కే వికెట్ కీపింగ్ బాధ్యతలు ఇస్తాను' అని అన్నారు.
'టీ20 ప్రపంచకప్ అనగానే నాకు మొదట గుర్తుకు వచ్చే పేరు సూర్యకుమార్ యాదవ్. ఎందుకంటే అతడు ఓ విలక్షణమైన ఆటగాడు, అత్యద్భుతమైన క్రికెటర్. ఈ సిరీస్‌తో ఫామ్‌లోకి వస్తే.. ప్రపంచకప్‌కు ముందు మంచి ప్రాక్టీసు లభిస్తుంది. సూర్య తిరిగి జట్టులోకి రావడం టీమిండియాకు మేలుచేసేదే' అని పేర్కొన్నారు. భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య మొదటి టీ20 జూన్ 26న జరుగుతుంది. డబ్లిన్‌లోని ది విలేజ్ మైదానంలో రాత్రి 9 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. రెండో టీ20 జూన్ 28 అదే మైదానంలో రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది.
Also Read: 1983 World Cup: భారత క్రికెట్ చరిత్రలోనే.. ఎప్పటికీ మర్చిపోలేని రోజుకు 39 ఏళ్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.