రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా ఘనవిజయం

రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా ఘనవిజయం

Last Updated : Oct 6, 2018, 03:36 PM IST
రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా ఘనవిజయం

రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత ఆటగాళ్లు సత్తాచాటడంతో తొలి టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మ్యాచ్ మూడో రోజే ముగిసింది.  

టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన కోహ్లీసేన తొలి ఇన్నింగ్స్‌లో 649 పరుగుల భారీ స్కోరు సాధించింది. విండీస్ ఆడిన రెండు ఇన్నింగ్స్‌లోనూ విఫలమై ఓటమిపాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 181 పరుగులకే కుప్పకూలి ఫాలోఆన్‌ ఆడింది. ఫాలోఆన్ ఆడిన వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ  50.5 ఓవ‌ర్లలో 196 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఫలితంగా తొలి టెస్టులో భారత్ విజయం సాధించింది.  దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల  టెస్టు సిరీస్‌‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది.

విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో కీరన్ పావెల్(83) తప్ప మరెవరూ రాణించలేదు. భారత బౌలర్ల ధాటికి విండీస్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పట్టారు. కాగా రెండో ఇన్నింగ్స్‌లో పది వికెట్లను స్పిన్నర్లే తీయగా..  టెస్టు క్రికెట్లో తొలిసారి కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లను తీశాడు. రవీంద్ర జడేజా 3, అశ్విన్ 2  వికెట్లు తీశారు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 649/9 (149.5) డిక్లేర్‌

విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 181 ఆలౌట్ (48)‌, రెండో ఇన్నింగ్స్‌ 196 ఆలౌట్‌ (50.5)

Trending News