CSK Vs MI: ముంబై వర్సెస్ చెన్నైకు చావో రేవో.. సీఎస్కే జట్టుకు షాక్

CSK vs MI: ఐపీఎల్ 2022లో కీలకమైన మ్యాచ్ ఇవాళ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌పై అందరి దృష్టీ నెలకొంది. కీలకమైన ఈ మ్యాచ్‌కు సీఎస్కే జట్టు స్టార్ ఆటగాడు దూరమయ్యాడు..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 21, 2022, 02:37 PM IST
  • ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య చావో రేవో మ్యాచ్
  • కీలకమైన మ్యాచ్‌లో ‌ చెన్నై సూపర్‌కింగ్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం
  • వివాహం కారణంగా మ్యాచ్‌‌కు దూరమైన డేవన్ కాన్వే
CSK Vs MI: ముంబై వర్సెస్ చెన్నైకు చావో రేవో.. సీఎస్కే జట్టుకు షాక్

CSK Vs MI: ఐపీఎల్ 2022లో కీలకమైన మ్యాచ్ ఇవాళ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌పై అందరి దృష్టీ నెలకొంది. కీలకమైన ఈ మ్యాచ్‌కు సీఎస్కే జట్టు స్టార్ ఆటగాడు దూరమయ్యాడు..

ఐపీఎల్ 2022 33 వ మ్యాచ్ ఇవాళ సీఎస్కే వర్సెస్ ఎంఐ మధ్య జరగనుంది. నాలుగుసార్లు టైటిల్ సాధించిన చెన్నై సూపర్‌కింగ్స్, ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ మధ్య ఈ మ్యాచ్ రెండు జట్లకూ కీలకం. అందరి దృష్టీ ఈ మ్యాచ్‌పైనే ఉంది. కారణం గత చాంపియన్లుగా ఉన్న ఈ రెండు జట్లు ఈసారి ఐపీఎల్‌లో ఘోరమైన పరాజయాన్ని చవిచూస్తున్నాయి. ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్‌లు ఆడి.. ఆరింట్లోనూ పరాజయం పాలైంది. అటు చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు కూడా ఆరు మ్యాచ్‌లు ఆడి..ఐదింట్లో పరాజయం పాలు కాగా, ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది.

ఈ రెండు జట్లకు ఇవాళ డూ ఆర్ డై పొజీషన్. రెండూ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఇక నుంచి విజయం దక్కించుకోవల్సిందే. ఈ క్రమంలో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు గట్టి దెబ్బే ఎదురైంది. సీఎస్కే జట్టులోని కీలకమైన ఆల్‌రౌండర్ దెవాన్ కాన్వే మ్యాచ్‌కు దూరమయ్యాడు. కారణం అతని పెళ్లి. పెళ్లి కోసం ఇప్పటికే దక్షిణాఫ్రికాకు వెళ్లిన కాన్వే..తిరిగి ఏప్రిల్ల 25 న జరిగే పంజాబ్ కింగ్స్ వర్సెస్ సీఎస్కే మ్యాచ్‌కు అందుబాటులో రానున్నాడు. ఇవాళ జరగనున్న మ్యాచ్‌కు దూరమయ్యాడు. దేవన్ కాన్వే ప్రీ వెడ్డింగ్ షూట్ ఇటీవల ముంబైలోని ఓ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సీఎస్కే ఆటగాళ్లంతా పాల్గొన్నారు. ఈ వేడుక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మహేంద్ర సింగ్ ధోనీ సహా సీఎస్కే ఆటగాళ్లంతా చెన్నై శైలిలో లుంగీ ధరించి ఉన్నారు.

ఇవాళ జరగనున్న సీఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ రెండు జట్లకు డూ ఆర్ డై లాంటిదే. అటు అభిమానులకు రసవత్తరంగా మారనుంది. ప్లే ఆఫ్‌కు చేరాలంటే రెండు జట్లు ఇక నుంచి విజయం వైపుకు సాగాల్సిందే. పాయింట్ల పట్టికలో అన్నింటికంటే దిగువన ముంబై ఇండియన్స్ ఉండగా..అంతకంటే ఓ స్థానం పైకి చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుంది. రెండు జట్లకు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరిగా మారిన నేపధ్యంలో అందరి దృష్టి ఈ మ్యాచ్‌పైనే పడింది.

Also read: Kieron Pollard Retirement: కిరెన్ పొల్లార్డ్ రిటైర్మెంట్ న్యూస్.. షాక్‌లో పొల్లార్డ్ ఫ్యాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News