IPL 2022 Match 5: రాజస్థాన్ రాయల్స్ తో తలపడనున్న సన్ రైజర్స్.. గెలుపెవరిది. ??

ఐపీఎల్‌ లో మంగళవారం మరో ఇంట్రెస్టింగ్‌ ఫైట్‌ జరగనుంది. రాజస్థాన్‌ రాయల్స్‌ తో ఆరెంజ్‌ ఆర్మీ తలపడనుంది. పుణె వేదికగా జరిగే ఈ తొలి మ్యాచ్‌ లోనే సత్తా చాటాలని రెండు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. దానికి అనుగుణంగానే కఠోర సాధన చేస్తున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 28, 2022, 07:09 PM IST
  • ఈ రోజు తొలి మ్యాచ్ ఆడనున్న SRH
  • SRH కెప్టెన్ గా కేన్‌ విలియమ్సన్‌
  • రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా సంజుశాంసన్‌
IPL 2022 Match 5: రాజస్థాన్ రాయల్స్ తో తలపడనున్న సన్ రైజర్స్.. గెలుపెవరిది. ??

IPL 2022 Match 5: ఐపీఎల్‌ 15వ ఎడిషన్‌ లో మ్యాచ్‌ లన్ని రసవత్తరంగా జరుగుతున్నాయి. గతేడాది లీగ్‌ దశలోనే ఇంటి ముఖం పట్టిన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. 2021 సీజన్‌ లో సన్‌ రైజర్స్‌.. 14 మ్యాచ్‌ లు ఆడితే కేవలం మూడింట్లో గెలిచి, 11 మ్యాచ్‌ ల్లో ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానానికే పరిమితమైంది. మంగళవారం SRH ఈ సీజన్‌ లో తన తొలి మ్యాచ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ తో ఆడనుంది. పుణె వేదికగా రాత్రి ఏడున్నరకు మ్యాచ్‌ ప్రారంభం అవుతుంది.

కేన్‌ విలియమ్సన్‌ నేతృత్వంలోని SRH టీం ఈ సారి సరికొత్తగా కనిపిస్తోంది. గతంలో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆడిన డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌ స్ట్రో, మనీష్‌ పాండే, రశీద్‌ ఖాన్‌, విజయ్‌ శంకర్‌, మహ్మద్‌ నబీ లాంటి కీలక ఆటగాళ్లు ఈ సీజన్‌ లో లేరు. SRH బ్యాటింగ్‌ లో కేన్‌ విలియమ్సన్‌, రాహుల్‌ త్రిపాఠి, మార్కరం, ప్రియమ్‌ గార్గ్‌, నికోలాస్‌ పూరన్‌, గ్లెన్‌ ఫిలీప్స్‌ కీలకం కానున్నారు. ఇక   మ్యాక్రో జేన్సన్‌, అబ్దుల్‌ సమద్‌, అభిషేక్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, గయనా ప్లేయర్‌ షెపర్డ్‌ లాంటి ఆల్‌ రౌండర్లతో బలంగా కనిపిస్తుంది. SRH బౌలింగ్‌ లైనప్‌ చూస్తే ఆస్ట్రేలియన్‌ పేసర్‌ అబాట్‌, భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, కార్తీక్‌ త్యాగిలతో స్పిన్నర్లు జగదీశ సుచిత్‌, శ్రేయస్‌ గోపాల్ ఉన్నారు.`

ఐపీఎల్‌ లో రెండో టైటిల్‌ కోసం రాజస్థాన్‌ రాయల్స్‌ ఎదురుచూపులు కొనసాగుతునే ఉన్నాయి. ఎలాగైనా ట్రోఫీ కొట్టాలనే ప్రతిసారి ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం మాత్రం అందడం లేదు. 2022 సీజన్‌ లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు దాదాపుగా పూర్తిగా మారిపోయింది. వేలానికి ముందు కెప్టెన్‌ సంజుశాంసన్‌, బట్లర్‌ తో పాటు యశస్వి జైశ్వాల్‌ ను రిటైయిన్‌ చేసుకుంది. మెగా వేలంలో మరో 21 మంది ఆటగాళ్లు కొనుగులు చేసింది. టీమిండియా పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ కోసం వేలంలో అత్యధికంగా 10 కోట్లు ఖర్చు పెట్టింది. విండీస్‌ బ్యాటర్‌ హెట్‌మయర్‌ కోసం 8.5 కోట్లు, న్యూజిలాండ్‌ పేసర్‌ బౌల్ట్‌ కోసం 8 కోట్లు, దేవ్‌దత్‌ పడిక్కల్‌ కోసం 7.75 కోట్లు, చాహల్‌ కోసం 6.5 కోట్లు, అశ్విన్‌ కోసం 5 కోట్లు ఖర్చుచేసింది. రాజస్థాన్‌ రాయల్స్‌కు బ్యాటింగే ప్రధాన బలం. కెప్టెన్‌ శాంసన్‌తో పాటు బట్లర్‌, పడిక్కల్‌, జైశ్వాల్‌, హెట్‌మయర్‌, వాండర్‌ డసెన్‌, పరాగ్‌లతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్ఠంగా ఉంది. ఇక ఎంతో అనుభవం ఉన్న అశ్విన్‌, చాహల్‌తో కూడిన స్పిన్‌ విభాగం ఆ జట్టుకు మరో బలం. మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగలిగే ఆల్‌రౌండర్లు లేకపోవడం రాజస్థాన్‌కు ప్రతికూలాంశం. కివీస్‌ ఆల్‌రౌండర్‌ నీషమ్‌ను తీసుకున్నప్పటికీ అతని పర్ఫామెన్స్‌ పై అనుమానాలున్నాయి. పేస్‌ బౌలింగ్‌లో అనుభవ లేమి రాజస్థాన్‌ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. విదేశీ పేసర్లలో బౌల్ట్‌ మినహా మరెవ్వరిపై నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి ఉంది. ఇక ప్రసిద్ధ్‌ కృష్ణ ఒత్తిడిని ఎలా తట్టుకుంటాడన్నది కీలకం. మొత్తంగా ఈ సీజన్‌ లో ఈ రెండు టీంలకు ఇదే తొలి మ్యాచ్‌. మమరి ఈ మ్యాచ్‌ లో ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడుతారో అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. ఆరెంజ్‌ ఆర్మీ ఈసారైనా టైటిల్‌ గెలవాలని.. తెలుగు రాష్ట్రాల క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

Also read; Birbhum Violence: రణరంగంగా మారిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ.. నలుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్

Also read: Trade Unions Strike: దేశవ్యాప్తంగా ఇవాళ కార్మికుల సమ్మె, బ్యాంకులకు సెలవు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News