Birbhum Violence: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ రణరంగమైంది. బీర్ భూం సజీవదహనాల ఘటనపై అధికార తృణమూల్, విపక్ష బీజేపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదికాస్తా ముదిరి తీరా ఒకర్నొకరు కొట్టుకునేదాకా వెళ్లింది. ఈ ఘటనలో పలువురు ఎమ్మెల్యేలు గాయపడ్డారు. పశ్చిమబెంగాల్ లోని బీర్‌భూంలో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల్లో ఎనమిది మంది సజీవదహనమయ్యారు.
ఈ ఘటనపై అసెంబ్లీలో చర్చకు విపక్ష బీజేపీ పట్టుబట్టింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఘోరంగా తయారైందని.. దీనిపై సీఎం మమతాబెనర్జీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలను టీఎంసీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. దీంతో ఇరుపార్టీల ఎమ్మెల్యేల మద్య గొడవ పెద్దదై కొట్టుకునేదాకా వెళ్లింది
ఘటనపై బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేకుండాపోయిందన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను టీఎంసీ ఖండించింది. అసెంబ్లీలో కావాలని గందరగోళం సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. అటు ఈ ఘటనలో సువేందు అధికారితో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ సభనుంచి సస్పెండ్ చేశారు.
BJP-TMC members clash in West Bengal Assembly today over #BirbhumViolence as BJP demanded a discussion over the brutal massacre. pic.twitter.com/K8QvyGSfYs
— Aditya Raj Kaul (@AdityaRajKaul) March 28, 2022
ఈ నెల 21 న పశ్చిబెంగాల్ లోని బీర్ భూం జిల్లా బర్షాల్ గ్రామంలో తృణమూల్ పార్టీనేత బాదుషేక్ ను హత్యచేశారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే బోగ్‌టూయి గ్రామంలో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇళ్లు కాలిబూడిదై 8 మంది సజీవదహనమయ్యారు. తృణమూల్ నేత హత్యకు ప్రతీకారంగానే టీఎంసీ కార్యకర్తలు ప్రత్యర్థుల ఇళ్లకు నిప్పుపెట్టినట్లు విపక్షాలు ఆరోపించాయి. పోస్టుమార్టం నివేదిక కూడా హత్యకుముందు వారిని తీవ్రంగా కొట్టినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై కోల్‌కతా హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న సీబీఐ 22 మందిని అరెస్ట్ చేసింది.
Also Read: RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై స్పందించని పవన్ కళ్యాణ్.. సినిమా ఇంకా చూడలేదా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Birbhum Violence: రణరంగంగా మారిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ.. నలుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్
రణరంగమైన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ
ఘటనపై తృణమూల్, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం
సభనుంచి సస్పెండ్ ఐన నలుగురు ఎమ్మెల్యేలు