Dhoni vs Kohli: బుమ్రా సతీమణితో ఆసీస్ మాజీ క్రికెటర్.. ధోనీ, కోహ్లీ సారథ్యంపై ఏమన్నాడంటే?

Shane Watson on MS Dhoni, Rohit Sharma and Virat Kohli's leadership: ఐపీఎల్ టోర్నీలో కోహ్లీ, ధోనీ సారథ్యంలో ఆడిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్‌ వాట్సన్‌ దిగ్గజాల నాయకత్వ శైలి గురించి చెప్పాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2022, 05:20 PM IST
  • బుమ్రా సతీమణితో ఆసీస్ మాజీ క్రికెటర్
  • ధోనీ, కోహ్లీ సారథ్యంపై వాట్సన్‌ ఏమన్నాడంటే
  • విరాట్ సూపర్ హ్యూమన్
Dhoni vs Kohli: బుమ్రా సతీమణితో ఆసీస్ మాజీ క్రికెటర్.. ధోనీ, కోహ్లీ సారథ్యంపై ఏమన్నాడంటే?

Shane Watson on MS Dhoni, Rohit Sharma and Virat Kohli's leadership: 1932లో ప్రపంచ క్రికెట్‌ వేదికపైకి భారత్ అడుగుపెట్టినప్పటి నుంచి ఎందరో సారథ్యం వహించారు. అయితే కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ లాంటి కొద్దిమంది కెప్టెన్‌లు మాత్రమే సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా ధోనీ, కోహ్లీలు టీమిండియాకు తిరుగులేని విజయాలు అందించారు. అందుకే చాలా మంది వీరిద్దరి నాయకత్వంను పోల్చుతుంటారు. ఐపీఎల్ టోర్నీలో కోహ్లీ, ధోనీ సారథ్యంలో ఆడిన  ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్‌ వాట్సన్‌ దిగ్గజాల నాయకత్వ శైలి గురించి చెప్పాడు. 

ఐసీసీ రివ్యూలో భాగంగా టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా సతీమణి సంజనా గణేశన్.. షేన్‌ వాట్సన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా షేన్ పలు విషయాలపై స్పందించాడు. 'కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అద్భుతాలు చేశాడు. ఆటగాళ్లను ఉత్సాహపరచడంలో ఎప్పుడూ ముందుంటాడు. భారీ అంచనాలు అతడిపై ఉన్న ప్రతిసారీ అందుకున్నాడు. విరాట్ సూపర్ హ్యూమన్. అద్భుతమైన వ్యక్తి. మైదానంలో ఎలా ఉండాలి, వెలుపల ఎలా ఉండాలనేది బాగా తెలుసు. బెంగళూరు జట్టులో కోహ్లీతో కలిసి పని చేయడం గొప్ప అనుభవం' అని వాట్సన్‌ అన్నాడు. 

'ఎంఎస్‌ ధోనీ నర నరాల్లో మంచు పరుగెత్తుతూ ఉంటుందేమో.. అందుకే మిస్టర్‌ కూల్‌ అయ్యాడు. ఒత్తిడిని అధిగమించగల సామర్థ్యం అతడికి బాగా కలిసొచ్చింది. జట్టులోని ఆటగాళ్లందరిపై విశ్వాసం కలిగి ఉంటాడు. వారికి తమ శక్తిసామర్థ్యాలపై నమ్మకం ఉండేలా చేస్తాడు. తన చుట్టూ ఉండే వ్యక్తులకు ఏమి కావాలో, వారిలో ఏ ప్రతిభ ఉందో సునాయాసంగా చదివేస్తాడు. ఆటగాళ్లు మైదానంలో అవసరమైనదే చేస్తారని మహీ నమ్ముతాడు' అని షేన్‌ వాట్సన్‌ పేర్కొన్నాడు. 

రోహిత్ శర్మ చాలా సహజమైన నాయకుడు. అతను ముంబై ఇండియన్స్‌కు నాయకత్వం వహించడాన్ని నేను దగ్గరగా చూశాను. అతడు ఒత్తిడికి అసలు గురికాడు. తన పనిని చేసుకుంటూ పోతాడు. ముంబై ఫ్రాంచైజీకి నాయకత్వం వహించిన అనుభవం టీమిండియాకు కలిసొస్తుంది' అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అన్నాడు. ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై తరఫున.. కోహ్లీ సారథ్యంలో బెంగళూరు జట్టుకు వాట్సన్‌ ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు సహాయక కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

Also Read; Russia-Ukraine Conflict: దోస్త్.. ఎండాకాలంలో చల్లటి బీర్స్ దొరకవంట.. బీర్ కంపెనీలపై ఉక్రెయిన్ సంక్షోభం ప్రభావం!

Also Read: Ramya Raghupati Case: ఆ భయంతో 3 నెలల క్రితమే పబ్లిక్ నోటీస్.. మాజీ భార్య కేసుపై నరేష్ రియాక్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News