Ramya Raghupati Case: ఆ భయంతో 3 నెలల క్రితమే పబ్లిక్ నోటీస్.. మాజీ భార్య కేసుపై నరేష్ రియాక్షన్

Ramya Raghupati Cheating Case: తన మాజీ భార్య రమ్య రఘుపతి ఆర్థిక లావాదేవీలతో తనకెటువంటి సంబంధం లేదని నటుడు వీకే నరేష్ స్పష్టం చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2022, 03:14 PM IST
  • రమ్య రఘుపతి చీటింగ్ కేసుపై నరేష్ రియాక్షన్
  • ఆమెతో ఎటువంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేసిన నటుడు
  • ఏడేళ్ల క్రితమే ఆమెతో విడిపోయినట్లు చెప్పిన నరేష్
Ramya Raghupati Case: ఆ భయంతో 3 నెలల క్రితమే పబ్లిక్ నోటీస్.. మాజీ భార్య కేసుపై నరేష్ రియాక్షన్

Ramya Raghupati Cheating Case:టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్.. తన మాజీ భార్య రమ్య రఘుపతి వసూళ్ల వ్యవహారంపై స్పందించారు. ఆమెతో తనకెటువంటి సంబంధం లేదని నరేష్ మరోసారి స్పష్టం చేశారు. తొమ్మిదేళ్ల క్రితం ఆమెను పెళ్లి చేసుకున్నానని.. ఆ తర్వాత రెండు, మూడేళ్లకే విడిపోయామని చెప్పారు. ఎవరి దారిలో వారు గౌరవంగా బతుకుతున్నామని చెప్పారు. రమ్య రఘుపతి వసూళ్ల వ్యవహారంపై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదవడం.. బాధితులు నరేష్‌ను సంప్రదించేందుకు ప్రయత్నిస్తుండటంతో ఆయన ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారంపై స్పందించారు.

'రమ్య రఘుపతి అప్పుల విషయం రెండు, మూడు రోజుల క్రితం వరకు నాకు తెలియదు. తొమ్మిదేళ్ల క్రితం మా పెళ్లి జరిగింది. ఆ తర్వాత రెండు, మూడేళ్లకే విడిపోయాం. విడిపోయి దాదాపు ఏడేళ్లవుతోంది. గతంలో కొన్ని ఇష్యూస్ జరగడంతో.. నాకు భయమేసి.. 3 నెలల క్రితమే ఒక పబ్లిక్ నోటీస్ కూడా ఇచ్చాను. ఆమెతో నాకు లేదా నా కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేదని. ఆమె విషయంలో ఏం జరుగుతుందో తెలియదు. నిన్న పోలీస్ స్టేషన్‌లో రమ్య రఘుపతిపై కేసు నమోదైనప్పుడు నాకు కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. రమ్య రఘుపతి ఆర్థిక లావాదేవీల విషయం తనకు తెలియకపోయినప్పటికీ.. బాధితులకు తాను సపోర్ట్‌గా నిలిచే ప్రయత్నం చేస్తానని చెప్పాను. మా కుటుంబానికి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు.' అని నరేష్ చెప్పుకొచ్చారు.

రమ్య రఘుపతి రంభ ఉన్నతి అరోమా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట పలువురి నుంచి అప్పులు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నరేష్ ఆస్తులను తన ఆస్తులుగా చూపించి హిందూపురం, అనంతపురం తదితర ప్రాంతాల్లో ఆమె భారీగా అప్పులు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. మంగళవారం (ఫిబ్రవరి 22) గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఐదుగురు మహిళలు ఆమెపై ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికైతే రమ్య రఘుపతి ఈ వ్యవహారంపై స్పందించలేదు. ఆమె ప్రస్తుతం ఎక్కడున్నారనే విషయంలోనూ క్లారిటీ లేదు. 

Also Read: Mallanna Sagar: మల్లన్న సాగర్ జలాశయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

Also Read: WhatsApp Tricks: మిమ్మల్ని బ్లాక్ చేసిన వారికి మెసేజ్ చేయాలా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News