RR vs LSG: లక్నోదే బ్యాటింగ్.. డికాక్‌కు మళ్లీ నిరాశే! తుది జట్లు ఇవే

ఐపీఎల్ 2023లో భాగంగా జైపూర్ వేదికగా మరికొద్దిసేపట్లో రాజస్థాన్ రాయల్స్‌, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో లక్నో ముందుగా బ్యాటింగ్ చేయనుంది. రాజస్థాన్ ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. ఆడమ్ జంపా స్థానంలో జాసన్ హోల్డర్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు లక్నో స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది.

Written by - P Sampath Kumar | Last Updated : Apr 19, 2023, 07:25 PM IST
RR vs LSG: లక్నోదే బ్యాటింగ్.. డికాక్‌కు మళ్లీ నిరాశే! తుది జట్లు ఇవే

Rajasthan Royals vs Lucknow Super Giants 26th Match IPL 2023 Playing 11: ఐపీఎల్ 2023లో భాగంగా జైపూర్ వేదికగా మరికొద్దిసేపట్లో రాజస్థాన్ రాయల్స్‌, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో లక్నో ముందుగా బ్యాటింగ్ చేయనుంది. రాజస్థాన్ ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. ఆడమ్ జంపా స్థానంలో జాసన్ హోల్డర్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు లక్నో స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది.

ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్‌, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఐదు మ్యాచ్‌లు ఆడాయి. రాజస్థాన్‌ నాలుగింట్లో విజయం సాధించగా.. లక్నో మూడింట్లో గెలిచింది. రాజస్థాన్ హ్యాట్రిక్ విజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. లక్నోపై మరో విజయం సాధించాలని చూస్తోంది. పంజాబ్ కింగ్స్ జట్టుపై ఓడిన లక్నో.. రాజస్థాన్‌పై గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది. 

తుది జట్లు:
లక్నో: కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), కైల్ మేయర్స్‌, దీపక్‌ హుడా, మార్కస్‌ స్టాయినిస్‌, కృనాల్ పాండ్య, నికోలస్‌ పూరన్‌, ఆయుష్‌ బదోని, నవీన్‌ ఉల్ హక్, అవేశ్‌ ఖాన్‌, యుధ్‌వీర్‌ సింగ్, రవి బిష్ణోయ్‌. 
రాజస్థాన్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్‌), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్‌మయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, జేసన్ హోల్డర్‌, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చహల్.

Also Read: RR vs LSG: లక్నోతో రాజస్థాన్‌ మ్యాచ్.. ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించనున్న యుజ్వేంద్ర చహల్‌!  

Also Read: Arjun Tendulkar Maiden IPL Wicket: ఆడింది రెండు మ్యాచ్‌లే.. తండ్రి సచిన్‌నే అధిగమించిన అర్జున్‌ టెండూల్కర్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News