Yuzvendra Chahal eye on Dwayne Bravo IPL Bowling Record: ఐపీఎల్ 2023 సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. బుధవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న లక్నోకు పంజాబ్ కింగ్స్ బ్రేక్ వేసింది. దాంతో రాజస్థాన్‌పై గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని లక్నో భావిస్తోంది. మరోవైపు రాజస్థాన్ హ్యాట్రిక్ విజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. పటిష్ట లక్నోపై మరో విజయం సాధించాలని చూస్తోంది. రెండు జట్లలో స్టార్ ప్లేయర్స్ ఉన్న నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. మ్యాచ్ రాత్రి 7.30కు మొదలవనుంది.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై చహల్ మరో 7 వికెట్లు తీస్తే ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు (Most IPL Wickets) తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కుతాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రేవో అగ్రస్థానంలో ఉన్నాడు. బ్రేవో 161 మ్యాచ్‌ల్లో 183 వికెట్స్ పడగొట్టాడు. ఇప్పటివరకు చహల్ 136 మ్యాచ్‌ల్లో 177 వికెట్స్ తీశాడు.
అయితే యుజ్వేంద్ర చహల్ ఈ మ్యాచ్‌లో 7 వికెట్స్ తీయడం దాదాపుగా ఆసాద్యమే. సువాయ్ మాన్‌సింగ్ స్టేడియం రాజస్థాన్ రాయల్స్‌కు సొంత మైదానం కాబట్టి ఏదైనా అద్భుతం జరుగుతుందో చూడాలి. చహల్‌కు లక్నోపై మంచి రికార్డు ఉంది. ఐపీఎల్ 2022లో లక్నోతో జరిగిన తొలి మ్యాచ్‌లో చహల్ 4 వికెట్స్ పడగొట్టాడు. రెండో మ్యాచ్‌లోనూ ఒక వికెట్ పడగొట్టి సత్తా చాటాడు. ఇక ఐపీఎల్ 2023లో సూపర్ ఫామ్‌లో చహల్ ఉన్నాడు. ఈ సీజన్‌లో ప్రస్తుతం లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. 5 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ 2023లో తొలి 25 మ్యాచులు ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో ఉంది. ఆడిన 5 మ్యాచులలో 4 గెలిచి.. 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచులలో 3 గెలిచి 6 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. పట్టికలో మొదటి, రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్, లక్నో జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఏ జట్టు గెలిస్తే ఆ టీం అగ్రస్థానికి చేరుకుంటుంది.
Also Read: Mohammed Siraj IPL Betting: తెలుగోడి నుంచి కాల్.. బెట్టింగ్ ట్రాప్‌లో మొహ్మద్ సిరాజ్! బీసీసీఐ విచారణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.