Ireland vs West Indies: టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం.. రెండుసార్లు ఛాంపియన్ విండీస్ ఔట్! సూపర్ 12కు ఐర్లాండ్

Ireland enters to Super 12s, West Indies knocked out. సంచనాలకు మారుపేరైన ఐర్లాండ్.. వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించి మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్‌ 2022 సూపర్ 12కు దూసుకెళ్లింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 21, 2022, 01:29 PM IST
  • టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం
  • రెండుసార్లు ఛాంపియన్ విండీస్ ఔట్
  • సూపర్ 12కు ఐర్లాండ్
Ireland vs West Indies: టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం.. రెండుసార్లు ఛాంపియన్ విండీస్ ఔట్! సూపర్ 12కు ఐర్లాండ్

Ireland beat West Indies and Enters T20 World Cup 2022 Super 12: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతోన్న టీ20 ప్రపంచకప్‌ 2022లో సంచలనం నమోదైంది. క్వాలిఫైయర్ రౌండ్‌ ఆరంభంలో మాజీ ఛాంపియన్ శ్రీలంకను నమీబియా చిత్తు చేయగా.. రెండుసార్లు ఛాంపియన్ అయిన వెస్టిండీస్‌ను స్కాట్లాండ్‌ ఓడించింది. తాజాగా సంచనాలకు మారుపేరైన ఐర్లాండ్.. వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించి మెగా టోర్నీ సూపర్ 12కు దూసుకెళ్లింది. విండీస్ నిర్ధేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఐర్లాండ్ 17.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ ఓటమితో మెహ టోర్నీలో విండీస్ కథ ముగిసింది. 

147 రన్స్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ జట్టుకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ (66 నాటౌట్; 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు), ఆండ్రూ బల్బిర్నీ (37; 23 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులు) ధాటిగా ఆడారు. విండీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ.. 73 పరుగుల భాగస్వామ్యంను నెలకొల్పారు. బల్బిర్నీ పెవిలియన్ చేరినా.. కీపర్ లోర్కాన్ టక్కర్ (44 నాటౌట్; 35 బంతుల్లో 2 సిక్సులు, 2 ఫోర్లు) అండతో స్టిర్లింగ్ జట్టుకు సునాయాస విజయం అందించాడు. విండీస్ బౌలర్ అకెల్ హుస్సేన్ ఒక వికెట్ పడగొట్టాడు.

ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ 5 వికెట్లకు 146 రన్స్‌ చేసింది. బ్రాండన్‌ కింగ్ (62; 48 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సు) మాత్రమే పోరాడాడు. జన్సన్ చార్లెస్ (18), ఒడియన్ స్మీత్ (19) పరుగులు చేశారు. స్టార్ బ్యాటర్లు ఎవిన్ లేవీస్ (13), నికోలస్ పూరన్ (13) విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్ గారెత్ డెలానీ 4 ఓవర్లలో 16 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. సిమి సింగ్, బారీ మెక్‌కార్తీ తలా ఒక వికెట్ తీశారు.

గ్రూప్ ఎ నుంచి ఇప్పటికే శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు సూపర్ 12కు అర్హత సాధించాయి. గ్రూప్ బి నుంచి ఇప్పుడు ఐర్లాండ్ సూపర్ 12కు దూసుకెళ్లింది. ఇక స్కాట్లాండ్, జింబాబ్వేలో ఏ జట్టు గెలుస్తే ఆ జట్టు గ్రూప్ బి నుంచి సూపర్ 12కు వెళ్తుంది. ఇక శనివారం నుంచి సూరప్ 12 మ్యాచులు ప్రారంభమవుతాయి. మెగా టోర్నీ తొలి మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ ఢీ కొట్టనుంది.  ఆదివారం భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. 

Also Read: రకుల్ ప్రీత్ సింగ్ క్లీవేజ్ షో.. లెహంగాలో కూడా అన్ని చూపించేస్తుందిగా!

Also Read: Prince Movie Review : ప్రిన్స్ రివ్యూ.. నో లాజిక్ ఓన్లీ కామెడీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News