Prince Movie Review : ప్రిన్స్ రివ్యూ.. లాజిక్‌లకు ఆమడదూరం

Siva Karthikeyan Prince Movie Review శివ కార్తికేయన్ ప్రిన్స్ సినిమా ఈ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాతో జాతి రత్నాలు మ్యాజిక్‌ను అనుదీప్ రిపిట్ చేస్తాడా? లేదా? అన్నది చూడాలి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2022, 01:29 PM IST
  • థియేటర్లోకి వచ్చిన శివ కార్తికేయన్ ప్రిన్స్
  • యావరేజ్ టాక్‌ తెచ్చుకున్న ప్రిన్స్
  • పని చేయని అనుదీప్ మ్యాజిక్
Prince Movie Review : ప్రిన్స్ రివ్యూ.. లాజిక్‌లకు ఆమడదూరం

Siva Karthikeyan Prince Movie Review : జాతి రత్నాలు సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ సపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు దర్శకుడు అనుదీప్. అసలు పెద్దగా కథ కూడా లేకుండానే జాతి రత్నాలు సినిమా మొత్తాన్ని నడిపి సూపర్ హిట్ కొట్టడమే గాక సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి దర్శకుడు ఒక తమిళ హీరోతో సినిమా చేస్తున్నాడు అనగానే ప్రిన్స్ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఒక విదేశీ హీరోయిన్‌ని సినిమాలోకి తీసుకోవడంతో సినిమా మీద ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇక అదే విధంగా సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్లు కూడా సినిమా మీద మరింత ఆసక్తి పెంచడానికి కారణమయ్యాయి. ఇక ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం

ప్రిన్స్ కథ ఏమిటంటే
కృష్ణా జిల్లా దేవరకొండ అనే గ్రామంలో వీర తిలకం విశ్వనాథం (సత్యరాజ్) ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన వ్యక్తి. రిటైర్డ్ ఆర్డీవో కావడంతో ఊరందరూ ఆయనని చాలా గౌరవిస్తూ ఉంటారు. ఊరిలో జరిగే దాదాపు అన్ని కార్యక్రమాలకు ఆయననే ముఖ్యఅతిథిగా పిలుస్తూ ఉంటారు. ఆయన కుమారుడు కావడంతో ఆనంద్ (శివ కార్తికేయన్‌)కు ఊరిలోనే ఉన్న ఒక స్కూల్లో సోషల్ టీచర్ ఉద్యోగం దొరుకుతుంది. అయితే చిన్నపిల్లల స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు తిరుగుతూ ఉండే ఆనంద్.. స్కూల్లో జాయిన్ అయిన కొత్త ఇంగ్లీష్ టీచర్ జెసిక (మరియా)తో మొదటి చూపులోనే ప్రేమలో పడతారు. కొన్నాళ్ల తర్వాత ఆమె కూడా ఆనంద్ ప్రేమను అర్థం చేసుకొని ప్రేమిస్తుంది. అయితే ఈ ప్రేమను పెద్దవారి దృష్టికి తీసుకెళ్లే సమయంలో అనుకోకుండా ఒక చిక్కు ఏర్పడుతుంది. అప్పటివరకు అంతా సాఫీగా సాగిపోతుందన్న సినిమాలో ఈ ట్విస్ట్ తో అసలు వీరిద్దరూ ఒకటి అవుతారా? లేదా? అనే విషయం మీద సందిగ్ధత నెలకొంటుంది. మరి బ్రిటిష్ అమ్మాయి జెస్సికా.. దేవరకొండ అబ్బాయి ఆనంద్ ఒకటయ్యారా లేదా అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ
జాతి రత్నాలు సినిమాని ఏమాత్రం సీరియస్‌నెస్ లేకుండా చేసి సూపర్ హిట్ అందుకున్న అనుదీప్.. ఈ సినిమా విషయంలో కూడా అదే టెంపో ఫాలో అయ్యాడు. అసలు ఏ మాత్రం సీరియస్ నెస్ కానీ లాజిక్ కానీ లేకుండా పూర్తిస్థాయి కామెడీతో సినిమా మొత్తాన్ని నడిపించే ప్రయత్నం చేశాడు. సాధారణంగా ఈ సినిమా అనుదీప్ దర్శకుడిగా తెలుగు నిర్మాతలు చేస్తున్నారని ప్రకటించగానే బైలింగిల్ మూవీ అవుతుందనుకున్నారు కానీ సినిమా చూస్తుంటే మొత్తం తమిళంలోనే షూట్ చేసి దాన్ని తెలుగు డబ్బింగ్ చెప్పించారా అని అనుమానం కలుగుతుంది.

 అలాగే తమిళనాడు నేపథ్యాన్ని తీసుకోవడంతో అక్కడ పాండిచ్చేరిని బేస్ గా తీసుకున్నట్లు అనిపించింది కానీ ఆంధ్రప్రదేశ్‌కు దాన్ని సరిగ్గా లాజికల్‌గా సింక్ చేయలేదనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఫ్రెంచ్ కాలనీలు అనేవి కృష్ణాజిల్లాలో ఎక్కడ ఉన్నాయో దర్శకుడు ఎస్టాబ్లిష్ చేయడంలో విఫలమయ్యాడు. దానిని యానం బేస్ గా తీసుకున్నట్లుగా సినిమా చివరలో చూపించారు కానీ సినిమా మొదటినుంచి కృష్ణాజిల్లా బేస్ తో జరుగుతూ చివరిలో యానం అంటూ చూపించడం కాస్త లాజిక్ కి దూరంగా ఉంటుంది

సినిమా మొత్తం కృష్ణా జిల్లాలో జరిగిందా లేక యానంలో జరిగిందా అనే విషయం మీద ప్రేక్షకులకు కన్ఫ్యూజన్ కి లోన్ అయ్యే అవకాశం ఉంటుంది. కథగా చూసుకుంటే సింపుల్ లైన్ కానీ దాన్ని పూర్తిస్థాయి కామెడీతో నడిపించేందుకు ప్రయత్నించి కొంతమేర సఫలమయ్యాడు. ఒక్కోచోట అనుదీప్ సృష్టించిన కామెడీ జబర్దస్త్ కామెడీకి దగ్గరగా అనిపించినా కొన్నిచోట్ల మాత్రం పంచులు బాగానే వేలాయి. సినిమాకి వెళ్ళాక లాజిక్ వెతికితే కష్టమే కానీ ఎలాంటి లాజిక్కు లేకుండా సినిమా చూసి ఎంజాయ్ చేయగలిగిన సినిమా ఇది.

నటీనటులు: 
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ ఇప్పటికే నటుడిగా అనేక పాత్రలతో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమాలో ఎలాంటి బాధ్యతలు లేకుండా జాలీగా తిరిగే ఒక కొడుకు పాత్రలో జీవించేశాడు. జెస్సికా పాత్రలో నటించిన మరియా కూడా ఇండియన్స్ స్క్రీన్‌కి కొత్తయినా ఏమాత్రం జంకు లేకుండా నటించింది. సీనియర్ నటుడు సత్యదేవ్ తనకిచ్చిన పాత్రకు న్యాయం చేశారు. సినిమా మొత్తాన్ని నడిపించడంలో ప్రేమ్జీ అమరేన్ ది కూడా ముఖ్య పాత్ర. చాలా కాలం క్రితం డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారికి పరిచయమైన ఆయన ఇప్పుడు మరోసారి మంచి పాత్రతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సంతానం సహా ఒకరిద్దరు తమిళ నటులు చిన్నచిన్న పాత్రలలో మెరిసి తమ వంతు ప్రయత్నం తాము చేశారు.

టెక్నికల్ టీం విషయానికి వస్తే
ఈ సినిమాకు కథా దర్శకత్వం చేసిన అనుదీప్ కేవి ఎక్కడ సినిమాని ట్రస్ట్ చేయడానికి గానీ లేదా కమర్షియల్ ఎలిమెంట్స్ చూపించడానికి గాని ట్రై చేయలేదు. పూర్తిస్థాయిలో కామెడీనే నమ్ముకుని దానితోనే ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసి కొంతమేర సఫలమయ్యాడు. కొన్ని సీన్లు మాత్రం ఓకే అనిపిస్తాయి . కానీ పూర్తిస్థాయిలో ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాగుంది. తమన్ అందించిన కొన్ని పాటలు ఆకట్టుకున్న మరికొన్ని మాత్రం ఏమాత్రం ఇంటరెస్టింగ్ గా అనిపించలేదు. ఎడిటింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకి తగినట్లుగానే ఉన్నాయి. రెండు బడా సంస్థలు కలిసి సినిమా నేర్పించడంతో సినిమా నిర్మాణం విలువలు అత్యద్భుతంగా కుదిరాయి.

ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలంటే
ప్రిన్స్ సినిమా ఒక కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్. కేవలం నవ్వించాలనే ఒకే ఒక్క కాన్సెప్ట్ తో సినిమా మొత్తాన్ని డిజైన్ చేసుకున్నాడు దర్శకుడు. కొన్ని సీన్లు చికాకు తెప్పించినా వీకెండ్ లో సరదాగా చూసేయగలిగిన ఎంటర్టైనర్.

రేటింగ్  : 2.5

గమనిక: ఈ సమీక్ష కేవలం ప్రేక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది మాత్రమే. 

Also Read : Ginna Movie Review : జిన్నా మూవీ రివ్యూ.. దుమ్ములేపేసిన సన్నీ లియోన్

Also Read : Prince Movie Twitter Review : ప్రిన్స్ ట్విట్టర్ రివ్యూ.. అనుదీప్ సినిమాపై అలాంటి టాక్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x