Jawan Movie Updates: అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డులు క్రియేట్ చేస్తున్న జవాన్.. తెలుగులోనూ కింగ్ ఖాన్ హవా..!

Jawan Advance Bookings: భారీ అంచనాల నడుమ జవాన్ మూవీ ఈ నెల 7న బాక్సాఫీసు ముందుకు రానుంది. పోస్టర్లు, ట్రైలర్‌తో భారీ అంచనాలు నెలకొనడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో భారీగా టికెట్లు అమ్ముడవుతున్నాయి.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 4, 2023, 03:55 PM IST
Jawan Movie Updates: అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డులు క్రియేట్ చేస్తున్న జవాన్.. తెలుగులోనూ కింగ్ ఖాన్ హవా..!

Jawan Advance Bookings: బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్-అట్లీ కాంబోలో తెరకెక్కిన మూవీ జవాన్. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్‌ అదిరిపోవడంతో అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. దీపికా పదుకొణె, నయనతార, విజయ్‌ సేతుపతి తదితరులు కీరోల్స్ ప్లే చేస్తుండగా.. సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ముందుకు రానుంది. హిందీతోపాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమవ్వగా.. భారీగా అభిమానులు టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌తో రికార్డులు సృష్టిస్తోంది. ట్రైలర్‌కు తోడు ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని వీడియోలు లీక్ కావడంతో భారీ బజ్ ఏర్పడింది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో గౌరీ ఖాన్ నిర్మించారు.

‘జవాన్‌’ అడ్వాన్స్‌ బుకింగ్‌తో థియేటర్లు అన్నీ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. నార్త్‌లోనే కాకుండా సౌత్‌లోనూ సినిమాహాళ్లు నిండిపోతున్నాయి. తిరుపతిలోని ఎన్‌వీఆర్‌ జయస్యం థియేటర్లలో తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కి  మొదటి రోజు 6 గంటల షో ఇప్పటికే 80 శాతం నిండిపోవడం ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉందో చెప్పడానికి ఉదాహరణ. 'నేనెవరో నాకు తెలియదు. నాకు ఎలాంటి ఉద్దేశాలు లేవు. నేను ఎవర్నీ కాను.. తెలియదు.. నేను మంచివాడినా..? చెడ్డవాడినా..? పుణ్యాత్ముడినో.. పాపాత్ముడినో.. నీకు నువ్వే తెలుసుకో.. ఎందుకంటే నేనే నువ్వు.. రెడీ' అంటూ షారూఖ్ ఖాన్ ట్రైలర్లో చెప్పే డైలాగ్ అదిరిపోయింది. 

పఠాన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న షారూఖ్‌.. జవాన్‌ సినిమాతో కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. ఈ మూవీలో డిఫరెంట్ షేడ్స్‌ ఉన్న పాత్రలు పోషించినట్లు తెలుస్తోంది. గుండుతో ఉన్న లుక్ అభిమానులకు నచ్చేసింది. బాక్సాఫీసు రికార్డులు కచ్చితంగా బద్దలు కొడుతుందని సినీ ప్రేమికులు అంచనా వేస్తున్నారు. రిలీజ్ కోసం వెయిటింగ్ అంటూ అభిమానులు నెట్టింట పోస్టులు వైరల్ చేస్తున్నారు.

Also Read: Nandamuri Kalyan Ram: కళ్యాణ్ రామ్ 'డెవిల్' మూవీ కోసం భారీ సెట్స్.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా..!    

Also Read: Jasprit Bumrah Blessed With Baby Boy: తండ్రైన బుమ్రా.. కుమారుడికి డిఫరెంట్ పేరు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News