Jasprit Bumrah Blessed With Baby Boy: తండ్రైన బుమ్రా.. కుమారుడికి డిఫరెంట్ పేరు

Jasprit Bumrah Son Name: జస్ప్రీత్ బుమ్రా తండ్రి అయ్యాడు. తన భార్య సంజనా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు బుమ్రా సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తన కుమారుడి పేరును కూడా వెల్లడించాడు. బుమ్రా దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 4, 2023, 01:13 PM IST
Jasprit Bumrah Blessed With Baby Boy: తండ్రైన బుమ్రా.. కుమారుడికి డిఫరెంట్ పేరు

 Jasprit Bumrah Son Name: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేషన్ సోమవారం పండంటి మగబిడ్డకు జన్మించారు. ఈ తీపికబురును బుమ్రా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. తన కొడుకు, భార్య, బుమ్రా ముగ్గురు చేతులు కలిసి ఉన్న పిక్‌ను షేర్ చేశాడు. తన కొడుకు పేరును కూడా బుమ్రా వెల్లడించాడు. అంగద్ జస్ప్రీత్ బుమ్రాగా నామకరణం చేసినట్లు తెలిపాడు. తన భార్యతో కలిసి ఉండటానికి ఆసియా కప్ 2023 నుంచి సెలవు తీసుకున్న బుమ్రా.. నేపాల్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. "మా చిన్న కుటుంబం పెరిగింది. మేం ఊహించలేనంత సంతోషంగా ఉన్నాం. ఈ ఉదయం మేము మా చిన్నోడు అంగద్ జస్ప్రీత్ బుమ్రాను ప్రపంచానికి స్వాగతించాం. మా జీవితంలోని ఈ కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నాం." అని బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

బుమ్రా దంపతులకు పలువురు క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కాంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే దినేష్ కార్తీక్ చేసిన ఫన్నీ కామెంట్ వైరల్ అవుతోంది. "యార్కర్లు వేయడంలో మాస్టర్‌వైతే సరిపోదు.. ఇక నుంచి డైపర్లు మార్చడంలోనూ మాస్టర్‌వి కావాలి.." అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. 

 

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by jasprit bumrah (@jaspritb1)

వెన్ను నొప్పి గాయం కారణంగా దాదాపు ఏడాది సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వచ్చాడు బుమ్రా. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో చక్కటి ఫామ్‌లో కనిపించాడు. వెంటనే ఆసియా కప్ కోసం భారత వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బుమ్రా బ్యాటింగ్‌లో ఆకట్టుకున్నాడు. 16 పరుగులు చేసి భారత్ స్కోరు బోర్డు 250 పరుగులు దాటేలా చేశాడు. అయితే వర్షం కారణంగా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. నేడు నేపాల్‌తో భారత్ తలపడనుండగా.. బుమ్రా దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌ను భారత్ గెలిచుకునే అవకాశం ఉండడంతో సూపర్-4 మ్యాచ్‌ల నాటికి బుమ్రా జట్టుతో చేరే అవకాశం ఉంది.   

Also Read: IRCTC Tour Package: వింటర్ టూర్ ఆఫర్.. తక్కువ ధరలోనే ఈ ప్రాంతాలను చూసేయండి  

Also Read: IND Vs NEP Dream11 Prediction Today Match: నేపాల్‌తో టీమిండియా పోరు.. పిచ్ రిపోర్టు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

  

Trending News