Ranji Trophy Yash Dhull: యశ్​ ధుల్ అరుదైన రికార్డు.. సచిన్, కోహ్లీలకు కూడా సాధ్యం కాలేదు!!

Yash Dhull first-class Record: భారత అండర్-19 కెప్టెన్ యశ్ ధుల్ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. అరంగేట్ర మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2022, 06:01 PM IST
  • యశ్​ ధుల్ అరుదైన రికార్డు
  • అరంగేట్ర మ్యాచ్​లోనే రెండు ఇన్నింగ్స్​లో శతకాలు
  • సచిన్, కోహ్లీలకు కూడా సాధ్యం కాలేదు
Ranji Trophy Yash Dhull: యశ్​ ధుల్ అరుదైన రికార్డు.. సచిన్, కోహ్లీలకు కూడా సాధ్యం కాలేదు!!

Yash Dhull slams second-successive ton in first-class debut match: భారత అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ యశ్ ధుల్ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. అరంగేట్ర మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. రంజీ ట్రోఫీ 2022లో భాగంగా ఢిల్లీ, తమిళనాడు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో యశ్ ధుల్ ఈ ఫీట్ అందుకున్నాడు. సీనియర్ క్రికెటర్‌గా కెరీర్ మొదలుపెట్టడానికి ముందే రంజీ ట్రోఫీలో మెరుపులు కురిపిస్తున్న యువ ఆటగాడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

రంజీ ట్రోఫీ 2022లో భాగంగా ఈ నెల 17న బరస్పరాలోని ఏసీఏ మైదానంలో ఢిల్లీ, తమిళనాడు జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఆరంభం అయింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో యశ్ ధుల్ 136 బంతుల్లో సెంచరీ చేశాడు. మొత్తంగా 150 బంతులు ఎదుర్కొన్న యశ్‌.. 113 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 200 బంతుల్లో 100 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అతడు 113 పరగులు చేశాడు. దాంతో రంజీల్లో అరంగేట్ర మ్యాచ్​లోనే రెండు ఇన్నింగ్స్​లో శతకాలు బాదిన మూడో ఆటగాడిగా నిలిచాడు.

యశ్ ధుల్ కంటే ముందు గుజరాత్‌ బ్యాటర్‌ నారీ కాంట్రాక్టర్ 1952-53 రంజీట్రోఫీ సీజన్‌లో అరంగేట్ర మ్యాచ్​లోనే రెండు ఇన్నింగ్స్​లో సెంచరీ చేశాడు. మహారాష్ట్ర బ్యాటర్‌ విరాగ్ అవతే  2012-13 సీజన్‌లో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. తాజాగా వీరి సరసన యశ్ ధుల్ చేరాడు. యశ్ నెలకొల్పిన ఈ రికారు క్రికెట్ దిగ్గజాలు అయిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలకు కూడా సాధ్యం కాలేదు. 

డిల్లీ, తమిళనాడు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. యశ్ ధుల్ రెండు సెంచరీలు బాదినా జట్టును గెలిపించలేకపోయాడు. ఐపీఎల్‌ 2022 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ యశ్‌ ధుల్‌ను 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక రంజీ ట్రోఫీని రెండు విడతలుగా బీసీసీఐ నిర్వహించనుంది. ఫిబ్రవరి 10న ప్రారంభమైన టోర్నీ తొలి దశ మార్చి 15 వరకు జరుగుతుంది. ఐపీఎల్​ 2022 పూర్తయ్యాక మే 30 నుంచి జూన్​ 26 వరకు రెండో దశ జరుగుతుంది.

Also Read; Rohit Sharma Tweet: రోహిత్ శర్మకు ముందే తెలుసా?.. మూడేళ్ల క్రితం నాటి ట్వీట్‌ వైరల్‌!!

Also Read: KCR-Uddhav Thackeray: కేసీఆర్-ఉద్దవ్ ఠాక్రే జాయింట్ ప్రెస్ మీట్.. ఏం చెప్పారంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News