CM KCR and Uddhav Thackeray Press Meet: దేశంలో ఒక పెద్ద మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. శివాజీ మహరాజ్, బాల్ ఠాక్రేల స్పూర్తితో ఈ దేశ ప్రజల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతో భేటీ సందర్భంగా దేశ రాజకీయాలతో పాటు పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. భావ సారూప్యం ఉన్న మరికొందరు నేతలతో సంప్రదింపులు జరుపుతున్నామని.. మరికొద్ది రోజుల్లోనే హైదరాబాద్ లేదా మరో చోట సమావేశమై దేశ రాజకీయాలపై చర్చిస్తామని తెలిపారు. ముంబైలో భేటీ అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
దేశం కోసం ఏం చేసినా బహిరంగంగానే చేస్తామని.. అందులో రహస్యమేమీ లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తాజా భేటీ ఆరంభం మాత్రమేనని అన్నారు.మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. 'దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, దిగజారుడు రాజకీయాలు.. ఇలాగే కొనసాగితే దేశ భవిష్యత్ ఏమవుతుంది. ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి ఎవరైనా కావొచ్చు.. కానీ ఈ భేటీ జరిగింది దేశ భవిష్యత్తుపై చర్చించడానికి..' అని స్పష్టం చేశారు.
అంతకుముందు, సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ముంబై చేరుకున్నారు. ముంబై విమానాశ్రయం నుంచి నేరుగా ఉద్దవ్ ఠాక్రే నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. కేసీఆర్ వెంట ఎంపీలు జోగినిపల్లి సంతోష్, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఉన్నారు. కేసీఆర్ ముంబై రాక సందర్భంగా పలుచోట్ల భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Posters welcoming Telangana CM K Chandrasekhar Rao to Maharashtra seen at various places in Mumbai
During his one-day visit to the state today, he will meet Maharashtra Chief Minister Uddhav Thackeray and NCP Chief Sharad Pawar pic.twitter.com/FibZCExxFA
— ANI (@ANI) February 20, 2022
Also Read: Rohit Sharma Tweet: రోహిత్ శర్మకు ముందే తెలుసా?.. మూడేళ్ల క్రితం నాటి ట్వీట్ వైరల్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook