భారత్‌కు బెస్ట్ ఫినిషర్ దొరికాడు: కేఎల్ రాహుల్

సుదీర్ఘ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా విజయంతో శుభారంభం చేసింది. 204పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలుండగానే ఛేదించింది.

Last Updated : Jan 25, 2020, 01:14 PM IST
భారత్‌కు బెస్ట్ ఫినిషర్ దొరికాడు: కేఎల్ రాహుల్

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌ పర్యటనను భారత్ విజయంతో శుభారంభం చేసింది. అతిథ్య కివీస్ రెండొందల పైచిలుకు స్కోరు చేసినా.. లక్ష్య ఛేదనలో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ రాణించడంతో మరో ఓవర్ మిగిలుండగానే భారత్ విజయం సాధించింది. అయితే ఆస్ట్రేలియా సిరీస్‌లో బ్యాటింగ్‌తో పాటు కీపింగ్‌లో సత్తా చాటి భారత్ సిరీస్ విజయంలో  కీలకపాత్ర పోషించిన కేఎల్ రాహుల్ కివీస్‌తో తొలి టీ20లోనూ సత్తా చాటాడు. కీపింగ్ చేయడం తన కెరీర్‌కు ప్లస్ పాయింట్ అని, తద్వారా పిచ్ మీద ఓ అవగాహన తెచ్చుకుని బ్యాటింగ్‌లో రాణిస్తున్నాని చెప్పాడు రాహుల్.

Also Read: అయ్యర్ మెరుపులు.. కివీస్‌పై భారత్ ఘన విజయం

తొలి టీ20లో విజయం సాధించిన తర్వాత మీడియాతో మాట్లాడాడు. ‘అంతర్జాతీయ క్రికెట్‌లో కీపింగ్ చేసే అవకాశాలు నాకు పెద్దగా రాలేదు. దేశవాలీలో కీపింగ్ చేసిన అనుభవం భారత్‌కు కీపింగ్ చేయడానికి తోడ్పడింది. అంతర్జాతీయ స్ఠాయిలో భారత్‌కు వికెట్ కీపర్‌గా ఆడటాన్ని ఆస్వాదిస్తున్నాను. కీపింగ్ వల్ల పిచ్ మీద కల్గిన అవగాహనతో బ్యాటింగ్‌లోనూ రాణిస్తున్నాను. డొమెస్టిక్‌ గేమ్స్ ఆడిన నేను ఇప్పుడు జాతీయ జట్టుకు పరుగులు సాధించడం సంతోషంగా ఉంది.

ఫినిషర్ కోసం ఎదురుచూస్తున్న టీమిండియాకు శ్రేయస్ అయ్యర్ దొరికాడు. కీలక సమయంలో అయ్యర్ బౌండరీలు బాది విజయావకాశాలు పెంచాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా చేసిన అనుభవం అయ్యర్ సొంతం. అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడిని ఎదుర్కొని మ్యాచ్‌లను ముగించడం శుభ పరిణామం. గత ఏడాదినుంచి సహజసిద్దంగా ఆటడం మానేసి క్రికెట్ ఫార్మాటింగ్ షాట్లు ఆడుతున్నాను. షాట్ సెలక్షన్‌తో పాటు నాపై నాకు నమ్మకం ఉందని’ కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News