'నా గుండె ముక్కలైంది': ఏబీడీ రిటైర్మెంట్​పై కోహ్లీ భావోద్వేగం

AB de Villiers: ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్​పై కోహ్లీ భావోద్వేగానికి లోనయ్యాడు. అతడి నిర్ణయంతో గుండె ముక్కలైందని పేర్కొన్నాడు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2021, 06:34 PM IST
  • ఏబీడీ రిటైర్మెంట్​పై కోహ్లీ భావోద్వేగం
  • గుండె ముక్కలైందని ట్వీట్​
  • నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడి
'నా గుండె ముక్కలైంది': ఏబీడీ రిటైర్మెంట్​పై కోహ్లీ భావోద్వేగం

Virat Kohli's heartfelt message for AB de Villiers: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్​ ఏబీ డివిలియర్స్ (ఏబీడీ) అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు శుక్రవారం సంచలన ప్రకటన చేశాడు. దీనిపై ఆర్​సీబీలో ఏబీడీ సహచర ఆటగాడు, మిత్రుడు.. విరాట్​ కోహ్లీ భావోద్వేగంగా స్పందించాడు.

ఏబీడీ తీసుకున్న నిర్ణయం తన గుండెను ముక్కలు చేసింది అంటూ కోహ్లీ స్పందించాడు. అయితే సరైన సమసయంలోనే ఆటకు గుడ్​ బై చెప్పాలనే ఆలోచనను స్వాగతిస్తున్నట్లు చెప్పాడు.

ఏబీ అత్యుత్తమ ఆటగాడు అని తాను కలిసిన వ్యక్తుల్లో అత్యంత స్పూర్తిదాయకమైన వ్యక్తి కూడా అతడేని కోహ్లీ తెలిపాడు కోహ్లీ.

Also read: మిస్టర్ 360 షాకింగ్ నిర్ణయం: అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ డివిలియర్స్

'ఆర్​సీబీ కోసం నువ్వు సర్వస్వం దారపోశావు. నువ్వేమిటో.. ఈ ఫ్రాంచైజీకి నువ్వు చేసిన కృషి నా గుండెల్లో చిరస్థాయిగా ఉంటుంది. చిన్న స్వామి స్టేడియం నీ ఆటను మిస్సవుతుంది. నీతో కలిసి ఆడే అవకాశాన్ని నేను కోల్పోతా.. ఐ లవ్​ యూ బ్రదర్​.. నేను నీకెప్పుడూ నంబర్​ 1 ఫ్యాన్​నే' అని ఇన్​స్టాలో పోస్ట్ చేశాడు కోహ్లీ.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

క్రికెట్​ కన్నా తమ ఇద్దరి మధ్య బంధం ఎంతో గొప్పదని.. అది ఎప్పటికి అలానే ఉంటుందని కోహ్లీ భావోద్వేగ భరితంగా రాసుకొచ్చాడు.

ఏబీడీ గురించి ట్విట్టర్​లో కోహ్లీ చేసిన ట్వీట్​కు.. ఏబీడీ కూడా లవ్​ యూ టూ మై బ్రదర్ అంటూ రిప్లై ఇచ్చాడు ఏబీ డివిలియర్స్.

Also read: సంచలనం: మహిళతో సెక్స్ చాటింగ్.. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేసిన పైన్!

వీరితో పాటు.. పలువురు ఇండియాన్ ఆటగాళ్లు, మాజీ ప్రేయర్స్ కూడా ఏబీడీకి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలిపారు.

క్రికెట్​లో మీరు ఓ లెజండ్ అంటూ శిఖర్ ధావన్ స్పందించాడు. ఆధునిక క్రికెట్​లో మీరు ఒకరని ఎన్​సీఏ డైరెక్టర్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్​ పేర్కొన్నాడు.

ఆర్​సీబీ భావోద్వేగం..

ఏబీడీ రిటైర్మెంట్ పట్ల ఆర్​సీబీ ఫ్రాంఛైజీ కూడా భావోద్వేగంగా స్పందించింది. 'నీ రిటైర్మెంట్​తో ఒక శకం ముగిసింది. ఆర్​సీబీలో నిన్ను బాగా మిస్సవుతాం. ఆర్​సీబీకి నువ్వు ఇచ్చినదానికి ధన్యవాదాలు. హ్యాపీ రైటర్మెంట్ లెజెండ్' అంటూ ట్వీట్ చేసింది.

Also read: సిరీస్ గెలిచే లక్ష్యంతో ఇండియా.. ఆశలు సజీవం చేసుకునేందుకు కివీస్​!

Also read: మహ్మద్ సిరాజ్ పై చేయి చేసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News