సంచలనం: మహిళతో సెక్స్ చాటింగ్.. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేసిన పైన్!

2017 లో తోటి మహిళతో అసభ్యకరమైన సందేశాలను, ఫోటోలు పంపిన విషయంలో అంగీకరించిన కెప్టెన్ పైన్.. ఆసీస్ జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2021, 11:33 AM IST
  • తోటి మహిళతో అసభ్యకమైన మెసేజ్ పంపిన పైన్
  • విచారణలో నిజమని తేలటంతో కెప్టెన్సీకి రాజీనామా
  • యాషెస్ సీరీస్ కు ముందు ఇలా జరగటం జట్టుకు నష్టమే
సంచలనం: మహిళతో సెక్స్ చాటింగ్.. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేసిన పైన్!

Paine Steps Down as Australia Test Cricket Captain: షాకింగ్ ఘటనల మధ్య తోటి మహిళకు అసంభ్యకర సందేశాలు పంపిన ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పైన్ కెప్టెన్సీకి రాజీనామా చేసాడు. 36 ఏళ్ల పెయిన్... 2017 లో జట్టుకు పని చేస్తున్న ఒక మహిళకు అసభ్యకరమైన మెసేజ్ లో పంపటం, కొన్ని ప్రైవేట్ పిక్స్ పంపాడని జరిగిన విచారణలో తేలిన నేపథ్యంలో కెప్టెన్ పైన్ జట్టుకు రాజీనామా చేసాడు. 

శుక్రవారం మీడియా ముందుకు వచ్చిన పైన్.. ఆసీస్ జట్టు కెప్టెన్సీకి నేను అర్హుడిని కాదు.. ఇది కష్టం అయినా.., నాకు, నా కుటుంబానికి... ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు నా రాజీనామా మంచిదని పేర్కొన్నాడు. 2017 లో తోటి మహిళతో సెక్స్ చాటింగ్ చేసిన పైన్.. ఆ మహిళ ఇపుడు ఆ విషయాలని బయట పెట్టడం.. విచారణ జరగటం.. పైన్ వీటిని అంగీరించటం కూడా జరిగింది. 

Also Read: PM Kisan Scheme: రూ.55-రూ.200 కట్టండి.. నెలకు రూ.3 వేలు పెన్షన్ పొందండి.. రైతులకు మాత్రమే

2018 సంవత్సరంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బాల్ టాంపరింగ్ కారణంగా నిషేధానికి గురవ్వగా.. అనుకోకుండా పైన్ ఆసీస్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. మూడేళ్ళుగా ఆసీస్ టెస్ట్ కెప్టెన్ గా కొనసాగుతున్న పైన్.. వచ్చే నెల ఇంగ్లాండ్ తో జరగనున్న యాషెస్ సీరీస్ కు ముందు ఇలా జరగటం జట్టుపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. 

Also Read: 'మూడు నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నాం': ప్రధాని మోదీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News