WFI New President: రెజ్లింగ్ సమాఖ్య నయా బాస్ సంజయ్ సింగ్.. కుస్తీకి గుడ్ బై చెప్పిన సాక్షీ మాలిక్..

WFI Election 2023: భారత రెజ్లింగ్‌ సమాఖ్య కొత్త అధ్యక్షుడిగా బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ స‌న్నిహితుడు సంజ‌య్ సింగ్ ఎన్నికయ్యారు. ఈ క్రమంలో స్టార్ రెజ్లర్ సాక్షీ మాలిక్ తను రెజ్లింగ్ ను వదిలేస్తున్నట్లు ప్రకటించింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2023, 08:00 PM IST
WFI New President: రెజ్లింగ్ సమాఖ్య నయా బాస్ సంజయ్ సింగ్.. కుస్తీకి గుడ్ బై చెప్పిన సాక్షీ మాలిక్..

Wrestling Federation New President Sanjay Singh: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్(Sanjay Singh) ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన యూపీ రెజ్లింగ్ సమాఖ్య ఉపాధ్యకుడిగా ఉన్నారు. పైగా ఆయన రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ కు అనుచరుడు కూడా. ఈ పదవి కోసం జరిగిన రేసులో 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్, రెజ్లర్ అనిత షెరాన్, యూపీ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు నిలిచారు. ఈ పోటీలో 40 ఓట్ల తేడాతో చివరికి సంజయ్ విజయం సాధించారు.

ప్రెసిడెంట్, కోశాధికారి, సెక్రటరీ జనరల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సహా 15 పోస్టులకు గురువారం ఎన్నికలు జరిగాయి. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు సన్నిహితుడు అయిన సంజయ్ సింగ్ ఇండియాకు ఒలింపిక్స్ లో మరిన్ని పతకాలు తీసుకువస్తానని ప్రచారం చేసి విజయం సాధించారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ మహిళా రెజర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బజరంగ్, వినేశ్, సాక్షి మాలిక్ వంటి స్టార్ రెజర్లు గతంలో ధర్నాకు దిగారు. ఈ క్రమంలో పాలక వర్గాన్ని కేంద్ర మంత్రిత్వశాఖ సస్పెండ్ చేసి.. తాజాగా ఎన్నికలు నిర్వహించింది. 

రెజ్లింగ్ వదిలేస్తున్నా.. సాక్షీ మాలిక్
ప్రస్తుత ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన అనితా షియోరాన్ కు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా మరియు వినేష్ ఫోగట్‌లతో సహా స్టార్ రెజ్లర్‌ల మద్దతు పలికినప్పటికీ సంజయ్ సింగ్ విజయం సాధించడం విశేషం. రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ స‌న్నిహితుడు సంజ‌య్ సింగ్ గెలుపొందడంతో తీవ్ర ఆవేదనకు గురైన సాక్షీ మాలిక్ రెజ్లింగ్ క్రీడను వదిలేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.

Also Read: SRH Squad 2024: కచ్చితమైన ఆల్‌రౌండర్లతో పటిష్టంగా ఆరెంజ్ ఆర్మీ, టైటిల్ మాదే అంటున్న ఫ్యాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News