SRH Squad 2024: ప్రతిసారీ ఐపీఎల్ వేలంలో తొందరపాటుగా వ్యవహరిస్తుందనే పేరున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఈసారి పక్కా ప్లాన్‌తో వ్యవహరించింది. ఎవరు కావాలో వారిపైనే టార్గెట్ చేసింది. ఎవర్ని ఎంతవరకూ కొనవచ్చే అంతకే బిడ్ చేసింది. స్టార్ ఆటగాళ్లను సొంతం చేసుకుని టీమ్‌ను పక్కాగా మార్చుకుంది.
ఐపీఎల్ 2024 వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు కలిపి ఆటగాళ్ల వేలానికి 230.65 కోట్లు ఖర్చు చేశాయి. 77 స్లాట్స్ ఖాళీగా ఉంటే 72 మంది ఆటగాళ్లు భర్తీ అయ్యారు. మరో ఐదు ఖాళీలు, కొంత నగదు ప్రతి టీమ్ వద్ద ఉండిపోయింది. 34 కోట్లతో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు స్టార్ ఆటగాళ్లతో పాటు బేస్ ప్రేస్ ఆటగాళ్లను కూడా తీసుకుని మరో 3 కోట్లు నగదు మిగుల్చుకుంది. వ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ట్రేవిస్ హెడ్, ప్యాట్ కమ్మిన్స్, వనిందు హసరంగా వంటి స్టార్ ఆటగాళ్లను సొంతం చేసుకుంది. పర్ఫెక్స్ ఆల్ రౌండర్ కొరత స్పష్టంగా ఉన్న ఆరెంజ్ ఆర్మీకు ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది.
పాట్ కమ్మిన్స్ కోసం 20.50 కోట్లు వెచ్చించినా ఎలాంటి నష్టం లేదనే చెప్పాలి. ఎందుకంటే అతనికి సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేరుంది. మంచి పేసర్, లోయర్ ఆర్డర్‌లో హిట్టింగ్ చేయగల సమర్ధుడు. అన్నింటికీ మించి టీమ్‌ను ఎలా నడిపించాలో బాగా తెలిసిన వ్యక్తి. కచ్చితంగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకే ఇంత భారీ ధర పెట్టిన ఎస్‌ఆర్‌హెచ్ ఇతడిని కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇక మరో ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ , ప్రపంచకప్ హీరో ట్రావిస్ హెడ్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌తో పోటీ పడి 6.80 కోట్లకు దక్కించుకుంది. మంచి ఓపెనర్, మంచి స్పిన్నర్ కావడంతో ఆరెంజ్ ఆర్మీకు సరైన ఆల్‌రౌండర్ దొరికినట్టే. ఇక ఆర్సీబీ రిలీజ్ చేసిన వనిందు హసరంగను 1.5 కోట్లకు దక్కించుకుంది. క్లాసిక్ స్పిన్నర్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉంది.
వీరికితోడు ఇప్పటికే ప్రస్తుత కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, గ్లెన్ ఫిలిప్, మార్కో జాన్సెన్, ఫజల్ హక్ ఫారూఖీ వంటి విదేశీ స్టార్ ఆటగాళ్లు ఉండనే ఉన్నారు. ఇక రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్, టి నటరాజన్ ఉండనే ఉన్నారు. మొత్తానికి ఆరెంజ్ ఆర్మీ చాలాకాలం తరువాత ఇప్పుడు పటిష్టంగా కన్పిస్తోందనే టాక్ విన్పిస్తోంది. అందుకే సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఈసారి టైటిల్ మాదే అంటున్నారు.
Also read: Ind vs SA 3rd ODI: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా చివరి వన్డే నేడే, సిరీస్ ఎవరిది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook