Yuvraj Singh: ఆ ఆరు సిక్సులకు 13 ఏళ్లు

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్.. యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ) ను తలుచుకోగానే మనందరికీ ముందుగా.. 2007లో తొలిసారిగా జరిగిన ఐసీసీ (ICC) టీ 20 ప్రపంచకప్‌లో యువీ ఒకే ఓవర్లో బాదిన ఆరు సిక్సులు గుర్తుకువస్తాయి. ఇప్పటికీ.. ఎప్పటికీ.. యువీ సాధించిన ఈ ఘనత చరిత్ర పుటల్లో అలానే నిలిచిఉంటుంది.. నిలుస్తుంది కూడా.. 

Last Updated : Sep 19, 2020, 12:49 PM IST
Yuvraj Singh: ఆ ఆరు సిక్సులకు 13 ఏళ్లు

Yuvraj Singh Six Sixes In Stuart Broad Over: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్.. యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ) ను తలుచుకోగానే మనందరికీ ముందుగా.. 2007లో తొలిసారిగా జరిగిన ఐసీసీ (ICC) టీ 20 ప్రపంచకప్‌లో యువీ ఒకే ఓవర్లో బాదిన ఆరు సిక్సులు గుర్తుకువస్తాయి. ఇప్పటికీ.. ఎప్పటికీ.. యువీ సాధించిన ఈ ఘనత చరిత్ర పుటల్లో అలానే నిలిచిఉంటుంది.. నిలుస్తుంది కూడా.. అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన టి 20 మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ ( Stuart Broad ) వేసిన ఓవర్‌లో యువీ బాదిన ఆరు సిక్సుల (Six Sixes In An Over ) రికార్డుకు నేటితో 13ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో ఆయన అభిమానులందరూ గత రికార్డును నెమరేసుకుంటూ.. సోషల్ మీడియా ద్వారా సిక్సర్ల కింగ్ యువీకి శుభాకాంక్షలు తెలుపుతూ.. అభినందిస్తున్నారు. Also read: Yuvraj Singh: ఆరు సిక్సుల గురించి కాదు...500 వికెట్ల గురించి మాట్లాడండి

2007 సెప్టెంబరు 19న దక్షిణాఫ్రికా డర్బన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టి 20 ( T20 World Cup ) మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందు బ్యాటింగ్‌కు దిగింది. టీమిండియా.. ఈ క్రమంలో ఉతప్ప ఔట్ అయిన వెంటనే క్రిజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ చెలరేగాడు. 18వ ఓవర్ వేసిన ప్లింటాఫ్‌ నుంచే బాదడం మొదలు పెట్టాడు. ఆతర్వాత ప్లింటాఫ్ యువీ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆతర్వాత 19వ ఓవర్ స్టువర్ట్ బ్రాడ్ వేయగా.. కసితో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టాడు. ఆ మ్యాచ్ యువీ లో మొత్తం 16 బంతుల్లో 3x4, 7x6తో 58 స్కోర్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేయగా.. ఛేదనలో ఇంగ్లాండ్ 200/6కే పరిమితమైంది. ఆ తర్వాత యూవీ ప్రభంజనం 2011 టి 20 ప్రపంచకప్ సాధించేంత వరకు నడిచింది. Also read: NIA Raids: 9మంది అల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్

ఇదిలాఉంటే.. గత ఏడాది జూన్ 10 న యువరాజ్ అన్ని క్రికెట్ ఫార్మెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.. యువరాజ్ తన కేరిర్‌లో 304 వన్డేలు, 58 టి 20, 40 టెస్టులు ఆడాడు.  Also read: Air India: దుబాయ్‌కు యథావిధిగా విమాన సర్వీసులు

Trending News