Yuvraj Singh: ఆరు సిక్సుల గురించి కాదు...500 వికెట్ల గురించి మాట్లాడండి

Stuat Broad: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ) ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ( Stuart Broad ) 500 వికెట్లు తీసినందుకు గాను శుభాకాంక్షలు తెలియజేశాడు.

Last Updated : Jul 29, 2020, 06:58 PM IST
Yuvraj Singh: ఆరు సిక్సుల గురించి కాదు...500 వికెట్ల గురించి మాట్లాడండి

Stuat Broad:  టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ) ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ( Stuart Broad ) 500 వికెట్లు తీసినందుకు గాను శుభాకాంక్షలు తెలియజేశాడు. దాంతో పాటు తన అభిమానులను ఆరు సిక్సుల (Six Sixes In An Over ) విషయాన్ని ప్రతీ చోట ప్రస్తావించకండి అని తెలిపాడు. 2007లో జరిగిన టీ20 ( T20 World Cup ) ప్రపంచకప్ లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లోనే యువరాజ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాది సిక్సర్ కింగ్ అయ్యాడు. Rafale Facts : రాఫెల్ విమానాల గురించి మీకు తెలియని 10 విషయాలు

స్టువర్ట్ గురించి తను ప్రస్తావించినప్పుడల్లా అభిమానులు సూపర్ సిక్సర్ మూమెంట్ గురించి ప్రస్తావిస్తుంటారు అని... కానీ స్టువర్ట్ బ్రాడ్ నేడు 500 వికెట్లు తీసి దిగ్గజాల సరసన చేరాడు.. ఆ విషయాన్ని గుర్తించాల్సిందే అన్నాడు యువీ.  TRAI New Tarrif: డీటీహెచ్  వినియోగదారులకు ట్రాయ్ గుడ్ న్యూస్

500 వికెట్లు తీయడం అనేది మామూలు విషయం కాదు. దాని కోసం ఎంతో పట్టుదలతో, కసి, ఏకాగ్రత అవసరం. బ్రాడ్ నువ్వు ఒక లెజెండ్ .. నీకు హ్యాట్సాఫ్ అని ట్వీట్ చేశాడు యువరాజ్ సింగ్. వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో స్టువర్ట్ బ్రాడ్ 500 వికెట్లు తీసి ఈ ఘనత సాధించిన 7వ బౌలర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ సందర్భంగా యువరాజ్ ట్వీట్ చేసి బ్రాడ్ కు శుభాకాంక్షలు తెలిపాడు. Railway Video: ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన రైల్వే సెక్యూరిటీ.. వీడియో 

Read This Story Also: 

Memes On Sonu Sood: సోనూ సూద్ పై వస్తున్న టాప్  మీమ్స్  ఇవే

Trending News