Flipkart offers: ఐఫోన్ 14 కోసం చూస్తున్నారా, ఇంతకంటే బారీ డిస్కౌంట్ మరెప్పుడూ లభించదు, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు

Flipkart offers: ఐఫోన్ 14 కొనాలనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. ఇంతకంటే భారీ డిస్కౌంట్ మరెప్పుడూ లభించదు. ప్రస్తుతం ఐఫోన్ 14పై ఊహించని తగ్గింపు ఉంది. ఆ ఆఫర్ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 21, 2024, 07:21 PM IST
Flipkart offers: ఐఫోన్ 14 కోసం చూస్తున్నారా, ఇంతకంటే బారీ డిస్కౌంట్ మరెప్పుడూ లభించదు, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు

Flipkart offers: ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024లో భాగంగా అన్ని రకాల మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అదే విధంగా ఐఫోన్ 14పై కూడా భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇప్పుడు చాలా తక్కువ ధరకే ఐఫోన్ 14 సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 14 కొనాలనుకునేవారికి అదే మంచి అవకాశం.

ఐఫోన్ 14 పై ఫ్లిప్‌కార్ట్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 69,900 రూపాయలుగా ఉంది. ఇప్పుడీ సేల్ సందర్భంగా 15 శాతం ఆఫర్ అందుతోంది. ఆఫర్ మినహాయిస్తే ఈ ఫోన్ ధర 58,999 రూపాయలకే లభించవచ్చు. ఇది కాకుండా ఎక్స్చైంజ్ లేదా క్రెడిట్ కార్డు కొనుగోలు అయితే మరింత తగ్గుతుంది. అందుకే ఐఫోన్ 14 కొనాలంటే ఇదే మంచి అవకాశం. ఇంతకంటే మించింది మరొకటి ఉండదు. 

ఐఫోన్ 14 ప్రత్యేకతలు

ఐఫోన్ 14లో 6.1 ఇంచెస్ సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లే కారణంగా వ్యూ చాలా బాగుంటుంది. చాలా రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. ఇందులో 1200 నైట్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల మరితం ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ డివైస్ పూర్తిగా సురక్షితమే కాకుండా అన్‌లాకింగ్ ఫేషియల్ ఐడీ సెన్సార్ కలిగి ఉంటుంది. 

ఇందులో ఏ15 బయోనిక్ చిప్ ఉంటుంది. ఇందులో 16 కోర్ న్యూరల్ ప్రోసెసింగ్ యూనిట్, 5 కోర్ గ్రాఫిక్స్ ప్రోసెసర్ ఉంటాయి. ఇందులో 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 14లో డ్యూయల్ కెమేరాసెటప్ ఉంటుంది. ఇది 12 మెగాపిక్సెల్ చొప్పున ఉంటాయి. వీడియో రికార్డింగ్‌లో డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది.

Also read: PPF Benefits: నెలకు 5 వేలు డిపాజిట్..మెచ్యూరిటీ తరువాత 26 లక్షలు ఎలాగంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News