iPhone 14 Offers: ఐఫోన్ 14 ప్లస్‌పై ఊహించని డిస్కౌంట్, కేవలం 44 వేలకే

iPhone 14 Offers: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. మీక్కావల్సిన ఐఫోన్ 14 చాలా తక్కువ ధరకే లభ్యం కానుంది. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక డిస్కౌంట్ అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 25, 2024, 11:34 AM IST
iPhone 14 Offers: ఐఫోన్ 14 ప్లస్‌పై ఊహించని డిస్కౌంట్, కేవలం 44 వేలకే

iPhone 14 Offers: ఆపిల్ కంపెనీ ఉత్పత్తులంటే అందరికీ క్రేజ్ ఎక్కువ. అందులో ఐఫోన్ అంటే పడి ఛస్తుంటారు. కానీ ధర ఎక్కువ కావడంతో చాలామంది కొనేందుకు వెనుకంజ వేస్తుంటారు. కానీ ఇప్పుడు ఐఫోన్ 14 స్పెషల్ సేల్ నడుస్తోంది. ఈ సందర్భంగా భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఈ సందర్భంగా ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ డిస్కొంట్ ప్రకటించింది కంపెనీ. మార్కెట్‌లో ఐఫోన్ 14 ప్లస్ ధర ప్రస్తుతం 79 వేలు రూపాయలు. కాగా ఫ్లిప్‌కార్ట్‌లో 16 శాతం డైరెక్ట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది అంటే డిస్కౌంట్ మినహాయిస్తే ఐఫోన్ 14 ప్లస్ ధర 66,999 రూపాయలైంది. ఇక ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఐఫోన్ 13 లేదా మిని ఐఫోన్ 13 ఎక్స్చేంజ్ ఇస్తే 23 వేల రూపాయలు తగ్గుతుంది. అంటే ఐఫోన్ 14 మీకు కేవలం 44,297 రూపాయలకే లభించనుంది. మొత్తం మీద డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్ మినహాయిస్తే 35,603 రూపాయలు ఆదా చేయవచ్చు

ఐఫోన్ 14 ప్లస్ అనేది 6.7 ఇంచెస్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇందులో 1284 / 2778 పిక్సెల్ రిజల్యూషన్ ఉంది. 1200 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. అంతేకాకుండా సిరామిక్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉండటంతో త్వరగా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. బ్యాటరీ విషయానికొస్తే 15 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 4,353 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్ 26 గంటలు పనిచేస్తుంది. ఇందులో ఎ15 బయోనిక్ చిప్‌సెట్ ఉండి హెక్సాకోర్ సీపీయూ, ఆపీల్ జీపీయూ కోర్ గ్రాఫిక్స్‌తో అనుసంధానమై ఉంటుంది. 6జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్‌తో పాటు 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇక ఐఫోన్ 14 ప్లస్ కెమేరా విషయానికొస్తే డ్యూయల్ 12 మెగాపిక్సెల్ కెమేరాలుంటాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో పాటు అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీ 12 మెగాపిక్సెల్ ఉంటుంది. 4కే రిజల్యూషన్‌తో వీడియో రికార్డింగ్ ఉంటుంది. కనెక్టివిటీ గురించి పరిశీలిస్తే వైఫై 802, బ్లూటూత్ 5.3 ఆధారంగా పనిచేస్తుంది. ఫేస్ ఐడీ ఉంటుంది. 

Also read: Gold at Indians: భారతీయుల వద్ద ఎంత బంగారం ఉంది, ఎంత తాకట్టు పెట్టారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News