Iqoo Z6 Lite 5G Price Cut: అమెజాన్‌లో ఇప్పుడు Iqoo Z6 Lite గేమింగ్ మొబైల్ రూ.550కే.. రూ.10,350 భారీ డిస్కౌంట్‌!

Iqoo Z6 Lite 5G Price Cut: ఎప్పటినుంచో అతి తక్కువ ధరలోని గేమింగ్ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం అమెజాన్ (amazon) ఉగాది సందర్భంగా గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేకమైన ఆఫర్స్ అందిస్తోంది. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన ఐక్యూ జెడ్ 6 లైట్ (iQOO Z6 Lite 5G) స్మార్ట్ ఫోన్ చీప్ ధరలోని లభిస్తోంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 9, 2024, 10:31 AM IST
Iqoo Z6 Lite 5G Price Cut: అమెజాన్‌లో ఇప్పుడు Iqoo Z6 Lite గేమింగ్ మొబైల్ రూ.550కే.. రూ.10,350 భారీ డిస్కౌంట్‌!

 

Iqoo Z6 Lite 5G Price Cut: ఉగాది సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో స్మార్ట్ ఫోన్స్‌పై ప్రత్యేకమైన డీల్స్ ప్రారంభమయ్యాయి. మల్టీ నేషనల్ బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్‌పై ఈ డీల్స్‌లో భాగంగా 30 నుంచి 50 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా కొన్ని మొబైల్ పై 50 శాతం వరకు కూడా ఫ్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అతి తక్కువ ధరలోని మంచి గేమింగ్ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సువర్ణ అవకాశంగా భావించవచ్చు. ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన ఐక్యూ బ్రాండ్‌కు సంబంధించిన మొబైల్ పై ఉగాది సందర్భంగా ఆమెజాన్ ప్రత్యేకమైన ఆఫర్స్ అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తాయి. ప్రస్తుతం అమెజాన్‌(amazon)లో ఏ మొబైల్‌పై అత్యధికమైన తగ్గింపు లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అమెజాన్లోని ఉగాది ప్రత్యేకమైన ఆఫర్స్‌లో భాగంగా ఐక్యూ జెడ్ 6 లైట్ (iQOO Z6 Lite 5G) స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ మొబైల్ పై బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అయితే ఇది కేవలం 6జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఈ వేరియంట్ ధర రూ. 19,999కు లభిస్తోంది. అమెజాన్ అందిస్తున్న ప్రత్యేకమైన ఉగాది ఆఫర్‌లో భాగంగా ఈ మొబైల్ ను కొనుగోలు చేసే వారికి 45 శాతం వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఇది కేవలం రూ. 10,999కే అందుబాటులో ఉంది.

అలాగే అమెజాన్‌(amazon)లో ఐక్యూ జెడ్ 6 లైట్ (iQOO Z6 Lite 5G) స్మార్ట్ ఫోన్  పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే క్రమంలో J అండ్ K బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే, రూ.1 వెయ్యి వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా BDS బ్యాంకు క్రెడిట్ కార్డును కూడా వినియోగించి పేమెంట్ చేసే వారికి పది శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతోపాటు ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ను వినియోగించి కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపుతో ఈ కొత్త మొబైల్ లభిస్తుంది. ఈ ఆఫర్‌ను వినియోగించాలనుకునేవారు ముందుగా వినియోగిస్తున్న పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు 10,350 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ ఐక్యూ జెడ్ 6 లైట్ మొబైల్ కేవలం రూ.550కే పొందవచ్చు.

ఐక్యూ జెడ్ 6 లైట్ టాప్‌ ఫీచర్స్‌:
డిస్‌ప్లే:

6.67" FHD+ IPS LCD డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
240Hz టచ్ శాంప్లింగ్ రేట్
HDR10+ సపోర్ట్

పెర్ఫార్మెన్స్:
Qualcomm Snapdragon 778G+ ప్రాసెసర్
8GB LPDDR5 RAM
128GB UFS 3.1 స్టోరేజ్
Android 12 ఆపరేటింగ్ సిస్టమ్
IQOO UI 12

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

కెమెరా:
64MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్:
64MP ప్రైమరీ కెమెరా
8MP అల్ట్రా-వైడ్ కెమెరా
2MP మాక్రో కెమెరా
16MP సెల్ఫీ కెమెరా

బ్యాటరీ:
5000mAh బ్యాటరీ
80W ఫ్లాష్ చార్జింగ్

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News