Vivo T3 5G Expected Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వీవో త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్‌ను కంపెనీ Vivo T3 5G మోడల్‌లో లాంచ్ చేయబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. వీవో ఈ మొబైల్‌ను Vivo T3 5G స్మార్ట్‌ఫోన్‌కి సక్సెసర్‌గా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీని డిజైక్ కూడా ఎంతో స్ట్రైలీస్‌గా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్ పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Vivo T3 5G మొబైల్ స్పెసిఫికేషన్స్:
ఇటీవలే లీక్ అయిన వివరాల ప్రకారం..ఈ Vivo T3 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీని ఫ్రాంట్ సెటప్‌లో భాగంగా పంచ్-హోల్ హౌసింగ్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్‌లో రాబోయే డిస్ల్పే HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులోకి వస్తుంది. దీంతో పాటు ఈ మొబైల్ స్క్రీన్ 1800 nits గరిష్టమైన బ్రైట్‌నెస్‌తో లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఈ Vivo T3 5G స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 7200 ప్రాసెసర్‌తో లభించబోతున్నట్లు కొంతమంది టిప్‌స్టర్స్ తెలిపారు. కంపెనీ దీనిని మొదట 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అదనంగా ఈ మొబైల్ Vivo ఎక్స్‌టెండెడ్ RAM 3.0 ఫీచర్‌ను కలిగి ఉండే ఛాన్స్ కూడా ఉంటుందని సమాచారం. కాబట్టి ఈ మొబైల్‌లో అవసరమైతే 8GB ర్యామ్ వరకు పెంచుకోవచ్చు.
ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే..వీవో ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీని బ్యాక్ సెటప్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP సోనీ IMX882 సెన్సార్ కెమెరా కలిగి ఉంటుంది. అలాగే అదనంగా 2MP బోకె లెన్స్ కెమెరా, ఫ్లికర్ సెన్సార్ కెమెరాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ ద్వారా సులభంగా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా లభిస్తోంది. దీంతో పాటు ఫ్రాంట్ సెటప్‌లో 16MP కెమెరా కూడా లభిస్తోంది.
ఈ Vivo T3 5G స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీతో లభించనుంది. దీంతో పాటు 44W ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్‌తో అందుబాటులోకి రానుంది. వివో మంచి ఆడియో అనుభూతిని అందించేందుకు డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా అందిస్తోంది. అలాగే ఇది వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో పాటు IP54 డస్ట్ సపోర్ట్‌ను కూడా అందించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ మొబైల్ భారత్‌లో లాంచ్ అయితే మొత్తం రెండు (క్రిస్టల్ ఫ్లేక్, కాస్మిక్ బ్లూ) కలర్స్‌లో అందుబాటులోకి రానుంది. అలాగే ఈ మొబైల్ ధర రూ.20,000తో లభించబోతున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి