Oppo A1i: ఏప్రిల్ 19న ఒప్పో నుంచి 256GB స్టోరేజ్‌ ఫోన్‌ లాంచ్‌.. లీకైన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!

Oppo A1i Leaked: అతి తక్కువ ధరలోనే మార్కెట్‌లోకి కొత్త వీవో మొబైల్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఇతర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 13, 2024, 12:36 PM IST
Oppo A1i: ఏప్రిల్ 19న ఒప్పో నుంచి 256GB స్టోరేజ్‌ ఫోన్‌ లాంచ్‌.. లీకైన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!

 

Oppo A1i Leaked: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఒప్పో ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన కెమెరా మొబైల్స్‌ను లాంచ్‌ చేస్తూ వస్తోంది. ఈ బ్రాండ్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని బ్రాండ్‌ని తమ కస్టమర్స్‌కి మరింత దగ్గరగా చేసేందుకు కంపెనీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఈ మొబైల్‌ ప్రీమియం ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది ప్రత్యేకమై డిజైన్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌ ఏంటో, ఏయే స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి రాబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

ఒప్పో తమ కొత్త మొబైల్‌ను Oppo A1i పేరుతో మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఫీచర్స్‌ కూడా ఇటీవలే పలువురు టిప్‌స్టర్స్‌ లీక్‌ చేశారు. లీక్‌ అయిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ప్రీ బుకింగ్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 19వ తేది నుంచి ప్రారంభం కాబోతోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ను కంపెనీ మొత్తం రెండు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది కేవలం డబుల్‌ కెమెరా సెటప్‌తో రానుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌తో పాటు 12GB ర్యామ్, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌లలో విడుదల కానుంది. అయితే దీనిని మొదటగా చైనా మార్కెట్‌లోకి లాంచ్‌ చేసి ఆ తర్వాత భారత్‌లో లాంచ్‌ చేయాలని కంపెనీ యోచిస్తోంది. 

ఒప్పో A1 5G ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ఈ Oppo A1i స్మార్ట్‌ఫోన్‌ 6.71 అంగుళాల ఫుల్ హెచ్‌డి + డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ డిస్ప్లే 2400x1080 పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌ను ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు బ్యాక్‌ సెటప్‌ వివరాల్లోకి వెళితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్‌ కెమెరా(50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో 2-మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరా)తో అందుబాటులోకి రానుంది. అలాగే LED ఫ్లాష్‌ను కూడా కలిగి ఉంటుంది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

అదనపు ఫీచర్స్:
67W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
డ్యూయల్ సిమ్
ఫేస్ రికగ్నిషన్
ఫింగర్‌ప్రింట్ స్కానర్
డ్యూయల్ స్పీకర్లు
Android 13 ఆపరేటింగ్ సిస్టమ్
8 మెగాపిక్సెల్ సెల్ఫీ ఫ్రంట్ కెమెరాను 
5000mAh బ్యాటరీ
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌
ఆండ్రాయిడ్ 13 ఆధారంగా కలర్ ఓఎస్ 13

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News