Poco M6 Pro 5G Price: దీపావళి సేల్‌లో Poco M6 Pro 5G మొబైల్‌ రూ.599కే..డిస్కౌంట్‌ ఆఫర్‌ వివరాలు ఇవే..

Poco M6 Pro 5G Price In India Flipkart: దీపావళి సేల్‌లో భాగంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌, ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా పొందవచ్చు. ఈ POCO M6 Pro 5G మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2023, 11:40 AM IST
Poco M6 Pro 5G Price: దీపావళి సేల్‌లో Poco M6 Pro 5G మొబైల్‌ రూ.599కే..డిస్కౌంట్‌ ఆఫర్‌ వివరాలు ఇవే..

 

Poco M6 Pro 5G Price In India Flipkart: ఫ్లిఫ్‌కార్ట్‌లోని దీపావళి సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రిక్‌ వస్తువులు భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్స్‌, వాషింగ్‌ మెషిన్స్‌, ఫ్రిడ్జ్‌లు 30 నుంచి 40 శాతం తగ్గింపుతో పొందవచ్చు. ఈ సేల్‌ స్మార్ట్‌ ఫోన్‌లను కొనుగోలు చేసేవారికి మంచి అవకాశంగా భావించవచ్చు. అతి తక్కువ ధరలకే మంచి బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయోచ్చు. అయితే ఈ పండగ సేల్‌లో ఏయే స్మార్ట్ ఫోన్‌లపై భారీ తగ్గింపుతో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్లిఫ్‌కార్ట్‌లో POCO M6 Pro 5G స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ మొబైల్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉన్నాయి. మొదట కంపెనీ 128 జీబీ వేరియంట్‌ ఈ మొబైల్‌ను MRP ధర రూ. 15,999కు విక్రయించింది. అయితే పండగ సేల్‌లో భాగంగా ఈ మొబైల్‌ ఫోన్‌ 25 శాతం తగ్గింపుతో ధర రూ.11,999కే పొందవచ్చు. దీంతో పాటు మీరు ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా పొందవచ్చు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

ఈ POCO M6 Pro 5G మొబైల్‌ను మరింత అదనపు తగ్గింపుతో పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ను వినియోగించవచ్చు. ఈ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. అయితే అదనపు తగ్గింపు పొందడానికి ఈ POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసే క్రమంలో బ్యాంక్‌ ఆఫ్ బరోడా క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 1,500 వరకు తగ్గింపు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా మీరు ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కూడా 10 శాతం తగ్గింపును పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను మీరు రూ. 10,499కే ఈ మొబైల్‌ను పొందవచ్చు. 

ఫ్లిఫ్‌కార్ట్‌ పండగ సేల్‌లో భాగంగా ఈ POCO M6 Pro 5G స్మార్ట్ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీరు వినియోగిస్తున్న పాత మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేసి దాదాపు రూ.11,400 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక ఈ డిస్కౌంట్‌ మీ పాత స్మార్ట్ ఫోన్‌ కండీషన్‌ బట్టి ఆధారపడి ఉంటుంది. మీ పాత స్మార్ట్ ఫోన్‌ కండీషన్‌ బాగుంటే దాదాపు మీరు ఈ మొబైల్‌ ఫోన్‌ రూ.599కే పొందవచ్చు.    

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Trending News