Telangana, AP Weather Updates: తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అలాగే రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రం నలుమూలలా అక్కడక్కడా తేలికపాటి వర్షాల నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం అధికారులు వెల్లడించారు. గురువారం తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురిశాయి.
శుక్రవారం కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు 23వ తేదీ శనివారం నుండి నాలుగు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు ఆనుకుని అల్పపీడనం కొనసాగుతుండటంతో పాటు అల్పపీడన ద్రోనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం విస్తరించింది ఉండటం ఈ వర్షాలకు కారణమైంది.
అల్పపీడనం ఇంకొన్ని గంటల్లో పశ్చిమ బెంగాల్, ఒడిషా తీరాల నుండి ఛత్తీస్‌గఢ్ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ తమ ప్రకటనలో పేర్కొంది. ఈ అల్పపీడనం ప్రభావం కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురువనున్నట్టు వాతావరణశాఖ స్పష్టంచేసింది. అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే కోస్తాంధ్రాతో పాటు రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. గురువారం విజయవాడతో పాటు రాజమండ్రిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
ఇది కూడా చదవండి : MLA Etela Rajender: ఎందుకు అమలు చేయలేదు కేసీఆర్.. మనసు లేకనా..? డబ్బులు లేకనా..?: ఈటల రాజేందర్
ఇదిలావుంటే, ఉత్తర భారత్‌లోని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే మహారాష్ట్ర, గుజరాత్, దక్షిణాదిన కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని భారత వాతావరణ శాఖ నివేదికలు స్పష్టంచేస్తున్నాయి.
ఇది కూడా చదవండి : Minister KTR: గంగిరెద్దులతో పోల్చిన మంత్రి కేటీఆర్.. ఆ హామీలు నమ్మొద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి