Hyderabad: పోలీసు శాఖలో కరోనా కలకలం.. గ్రేటర్ పరిధిలో 72 మందికి పాజిటివ్!

Hyderabad: పోలీసులపై కరోనా పంజా విసురుతోంది. తెలంగాణలో భారీ సంఖ్యలో పోలీసులు కరోనా బారిన పడుతున్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2022, 06:36 PM IST
  • పోలీసు శాఖలో కరోనా కలకలం
  • గ్రేటర్ పరిధిలో 72 మందికి పాజిటివ్
  • అప్రమత్తమైన అధికారులు
Hyderabad: పోలీసు శాఖలో కరోనా కలకలం.. గ్రేటర్ పరిధిలో 72 మందికి పాజిటివ్!

Covid-19 in Telangana Police Department: తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కొవిడ్ కేసులు (Corona Cases in Telangana) భారీగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే వైద్యులు కరోనా బారిన పడుతుండగా..తాజాగా పోలీసులపై కూడా ఈ మహమ్మారి పంజా విసురుతోంది. గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) పరిధిలో 72మంది పోలీసులు వైరస్‌ బారినపడ్డారు. తాజాగా హైదరాబాద్ సీసీఎస్‌, సైబర్ క్రైమ్‌ విభాగాల్లో పనిచేస్తున్న 20 మంది పోలీసు సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.

హయత్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లో 15 మంది, చైతన్యపురి పోలీసుస్టేషన్‌లో 8 మందికి కరోనా (Covid-19) సోకింది. అలాగే వనస్థలిపురం, అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసు స్టేషన్లలో ఒక్కరు చొప్పున, అల్వాల్‌ పీఎస్‌లో నలుగురు కానిస్టేబుళ్లు కరోనా బారినపడ్డారు. సోమవారం యాదగిరిగుట్ట పోలీసు స్టేషన్‌లో ఏసీపీ, సీఐ సహా 12 మందికి ఈ వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. 

Also read: TS DPH Srinivasa Rao tests positive : తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ శ్రీనివాసరావుకు కరోనా

తాజాగా రంగారెడ్డి జిల్లా (Rangareddy District) నార్సింగి పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం రేపింది. 20 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా సోకిన పోలీసులు హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.  శాంతిభద్రతల కోసం శ్రమించే వీరంతా ఇప్పుడు కొవిడ్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News