TS DPH Srinivasa Rao tests positive : తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ శ్రీనివాసరావుకు కరోనా

Telangana DPH Dr G Srinivasa Rao tests positive for covid : తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ శ్రీనివాసరావుకు కరోనా. ముందు జాగ్ర‌త్త‌గా హాస్పిటల్‌లో జాయిన్ అయిన శ్రీనివాసరావు. మరోవైపు హైదరాబాద్‌లోని పోలీసు స్టేషన్‌లలో కరోనా విజృంభిస్తోంది. చాలా మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2022, 06:13 PM IST
  • తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ శ్రీనివాసరావుకు కొవిడ్ పాజిటివ్
  • ముందు జాగ్ర‌త్త‌గా హాస్పిటల్‌లో జాయిన్ అయిన శ్రీనివాసరావు
  • మరోవైపు పోలీసు స్టేషన్‌లలో విజృంభిస్తోన్న కరోనా
TS DPH Srinivasa Rao tests positive : తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ శ్రీనివాసరావుకు కరోనా

telangana director of public health dr. srinivasa rao tests positive for covid : తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు (DPH Dr G Srinivasa Rao) కొవిడ్ బారిన పడ్డారు. కరోనా ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా ఉండ‌డం వల్ల ఆయన కొవిడ్ టెస్ట్ (Covid test) చేయించుకున్నారు. దీంతో కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ముందు జాగ్ర‌త్త‌గా డాక్టర్‌ శ్రీనివాసరావు (dr. srinivasa rao) త‌గిన చికిత్స కోసం హాస్పిటల్‌లలో జాయిన్ అయ్యారు. 

అయితే ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదని డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఎలాంటి అపోహాలు వ‌ద్దని, త్వ‌ర‌లోనే తాను కొవిడ్ నుంచి కోలుకుంటాన‌ని ఆయన పేర్కొన్నారు. కొవిడ్ విషయంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ (director of public health) కోరారు. ఇక తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.

ఇక హైద‌రాబాద్ (Hyderabad) పోలీసుల‌పై కూడా కొవిడ్ పంజా విసిరింది. చాలా పోలీసు స్టేష‌న్‌లో కొవిడ్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్సైలతో పాటు కానిస్టేబుళ్లు కొవిడ్ బారిన ప‌డుతున్నారు. సీసీఎస్, సైబ‌ర్ క్రైమ్‌లో ప‌ని చేస్తోన్న 20 మంది పోలీసుల‌కు కొవిడ్ పాజిటివ్‌గా (Covid Positive‌) నిర్ధార‌ణ అయింది.

Also Read : AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా 6,996 కరోనా కేసులు

ఇటీవ‌ల సైబ‌ర్ క్రైమ్ టీమ్ ఒక కేసు విష‌యంలో రాజ‌స్థాన్‌కు వెళ్లి రాగా.. ఆ టీమ్‌లోని ఒక ఎస్సైకి కొవిడ్ సోకింది. ఆ తర్వాత ఆయన నుంచి మిగ‌తా వారంద‌రికీ కోవిడ్ సోకిన‌ట్లు అధికారులు భావిస్తున్నారు. అలాగే హ‌య‌త్‌న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్‌లో కూడా ఎస్సైతో పాటు 14 మంది కానిస్టేబుళ్ల‌కు కొవిడ్ (Covid) సోకింది. అబ్దుల్లాపూర్‌మెట్‌, వ‌న‌స్థ‌లిపురం పోలీసు స్టేష‌న్ల ప‌రిధిలో ఇద్దరు కానిస్టేబుల్స్‌కు, నార్సింగి పోలీసు స్టేష‌న్‌లో ఇరవై మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇక తెలంగాణలో పెరుగుతోన్న కొవిడ్ కేసులను (Covid cases) అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటూనే ఉంది.

Also Read : Amazon vs Flipkart: అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై క్రేజీ ఆఫర్లు.. త్వరపడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News