Bandi Sanjay to KCR: నా కొడుకును నేనే పోలీసు స్టేషన్‌లో సరెండర్ చేస్తా..

Bandi Sanjay Press Meet: తన కుమారుడు బండి సాయి భగీరథ్‌పై దుండిగల్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేయడంపై తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తనని రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాక పిల్లలని చూడకుండా నా కొడుకుపై కేసు పెట్టిస్తవా అంటూ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2023, 04:37 AM IST
Bandi Sanjay to KCR: నా కొడుకును నేనే పోలీసు స్టేషన్‌లో సరెండర్ చేస్తా..

Bandi Sanjay Press Meet About Sai Bhagirath: తన కుమారుడు బండి సాయి భగీరథ్‌పై దుండిగల్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేయడంపై తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తనని రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాక పిల్లలని చూడకుండా నా కొడుకుపై కేసు పెట్టిస్తవా అంటూ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. రాజకీయాల మధ్యలోకి చిన్న పిల్లలను లాగి వారి జీవితాలను నాశనం చేయాలనుకుంటున్నావా అని ప్రశ్నించారు. కాలేజీలో పిల్లలు కొట్టుకుంటారు... కలిసిపోతారు... నీకేం నొచ్చింది అంటూ విరుచుకుపడ్డారు. తప్పు చేసినట్లు ఆ అబ్బాయే స్వయంగా ఒప్పుకున్నాడు... వాళ్లు మళ్లీ ఎప్పుడో దోస్తులయ్యారు. అదేమీ పట్టించుకోకుండా నా కొడుకు సాయి భగీరథ్ పై లేనిపోని ఆరోపణలు చేయడం తగదని అన్నారు.

వాళ్లు కలిసిపోయినప్పటికీ కాలేజీపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టిస్తావా ? నా కొడుకును పోలీస్ స్టేషన్‌లో నేనే సరెండర్ చేస్తా. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా ? లాఠీలతో కొడతారా ? ఏం చేస్తారో చూస్తాం అని పోలీసులకు, ప్రభుత్వానికి సవాల్ విసిరారు. చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగకూడదనే ఇంకిత జ్ఝానం కూడా లేదా నీకు అని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో నీ మనవడిపై ఏవేవో ఆరోపణలు వస్తే.. వాటిని ఖండించిన వ్యక్తిని నేను అని గుర్తుచేసుకున్నారు. అంతేకాదు.. తాను తలుచుకుంటే గంటసేపట్లో నీ మనవడు చేసిన పనులన్నీ వెలికి తీయగలను అని కేసీఆర్‌ని హెచ్చరించారు.

యాదాద్రి లక్ష్మీ నర్సింహా స్వామిపై రూ.1200 కోట్ల పెట్టుబడి పెట్టి రోజుకు కోటి రూపాయల లాభం వస్తోందని నీ కొడుకు చెప్పడం సిగ్గు చేటు అని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. నిఖార్సైన హిందువనని చెప్పుకున్నావ్. మరి హిందూ దేవుళ్లను నాస్థికులు కించపరుస్తుంటే ఎందుకు నోరు తెరవడం లేదని ప్రశ్నించారు. ఎవడబ్బ సొమ్ము అని ప్రజాధనంతో నిజాం మనువడి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరుపుతావ్ అని విరుచుకుపడ్డారు. నీ పాపం పండిందన్న బండి సంజయ్.. నీ డౌన్‌ఫాల్ స్టార్టయ్యిందని అన్నారు. గ్యాంగ్‌స్టర్ నయీం డైరీ కేసు, యాదాద్రిపై చేస్తోన్న వ్యాపారం, నీ కుటుంబ అవినీతిని నిగ్గు తేల్చేదాకా వదిలే ప్రసక్తే లేదని బండి సంజయ్ ఛాలెంజ్ చేశారు.

ఇది కూడా చదవండి : Bandi Sanjay's Son Booked: బండి సంజయ్ తనయుడు సాయి భగిరథ్‌పై కేసు నమోదు.. అసలేం జరిగింది ?

ఇది కూడా చదవండి : Mahindra XUV400 EV: మహింద్రా నుంచి మరో కొత్త బాహుబలి.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 456 కిమీ రేంజ్

ఇది కూడా చదవండి : Uppal Stadium Cricket Match: ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్.. ఎప్పటి నుంచి లోపలికి అనుమతిస్తారంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News