Bandi Sanjay: టిఆర్ఎస్ నేతల కళ్ళు దొబ్బాయా ? బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay Praja Sangrama Yatra: బిజెపిని చూసి కేసిఆర్ గజగజ వణుకుతున్నాడు. అసదుద్దీన్ ఒవైసీ చెంప ఛెల్లుమనిపించేలా పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభ నిర్వహించి మనం ఏంటో చూపించాం అని బండి సంజయ్ అన్నారు. 

Last Updated : Dec 2, 2022, 05:23 AM IST
Bandi Sanjay: టిఆర్ఎస్ నేతల కళ్ళు దొబ్బాయా ? బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay Praja Sangrama Yatra: తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావుకు అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదో సమాధానం చెప్పాలని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ పాదయాత్రకు ప్రజలు రావడం లేదని అంటున్న టిఆర్ఎస్ నేతలు మరి బైంసా బహిరంగ సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టిఆర్ఎస్ నేతల కళ్ళు దొబ్బాయా ? గజ్జలమ్మ తల్లి దేవాలయం చాలా శక్తివంతమైంది. గజ్జలమ్మ తల్లి అమ్మవారు కూడా అంతే పవర్ ఫుల్. అలాంటి గజ్జలమ్మ తల్లి ఆలయాన్ని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని అడిగారు. 

కేసీఆర్ సంగతి చూసేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం అని బండి సంజయ్ ప్రకటించారు. బిజెపిని చూసి కేసిఆర్ గజగజ వణుకుతున్నాడు. అసదుద్దీన్ ఒవైసీ చెంప ఛెల్లుమనిపించేలా పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభ నిర్వహించి మనం ఏంటో చూపించాం. ముందస్తుగానే టైం, ప్లేస్ చెప్పి మరీ వెళ్లడం ద్వారా పాత బస్తి మీ గడ్డ కాదు... మా అడ్డా అని నిరూపించాం అని అన్నారు. 

బైంసా కాదు మహిషా...
బైంసాకు రాకుండా అడ్డుకునేందుకు కేసీఆర్ ఎంత ప్రయత్నం చేసినా... మనం వచ్చామా లేదా ఎద్దేవా చేసిన బండి సంజయ్.. కేసీఆర్ పైసలిచ్చినా... టిఆర్ఎస్ బహిరంగ సభలకు ఎవరూ వచ్చే పరిస్థితి లేదు. చప్పట్లు కొట్టండని అడుక్కుని మరీ కేసీఆర్ జనం చేత చప్పట్లు కొట్టించుకుంటున్నాడు. కానీ బీజేపి పరిస్థితి అలా కాదు. బీజేపిని ప్రజలే ఆదరిస్తున్నారని అన్నారు.

ఈ సమయానికే కేసీఆర్ రెండు పెగ్గులు వేసి ఉంటాడన్న బండి సంజయ్.. మీ జోష్ చూస్తే ఇక ఫుల్ బాటిల్ కూడా లేపేస్తాడని ఛమత్కరించారు. రాత్రంతా ఎవరి కొంపలు ముంచాలా అని ఆలోచిస్తాడు.. తెల్లందాకా పంటడు అని వ్యాఖ్యానించారు. 

మీకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చాయా ? మిషన్ భగీరథ నీళ్లు వచ్చాయా ? అని అడిగి తెలుసుకునే క్రమంలో.. తెలంగాణకు 2 లక్షల 40 వేల ఇండ్లను మోదీ సర్కారు మంజూరు చేసి ఇండ్ల నిర్మాణం కోసం 4,000 కోట్ల రూపాయలను మంజూరు చేస్తే... వాటిని కేసీఆర్ ఏం చేశాడు అని నిలదీశారు. పేదలకు ఇండ్లు ఇవ్వకుండా కేసీఆర్ వారిని మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. మహారాష్ట్రలో ఒక్క రోజే లక్ష ఇండ్లు ఇచ్చి, గృహప్రవేశం చేయించిన ఘనత అక్కడి బిజెపి సర్కారు సొంతం అని బీజేపిని ఆకాశానికెత్తారు. 

అన్ని కుంభకోణాల్లో కేసీఆర్ కుటుంబమే
ధనిక రాష్ట్రమైన తెలంగాణకి 5 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిండు. పుట్టబోయే బిడ్డపై కూడా లక్ష రూపాయల అప్పు ఉండేలా చేసిండు. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నిధులు లేవు కానీ భారీ మొత్తంలో కుంభకోణాలకు పాల్పడి కోట్ల రూపాయలు దండుకోవడానికి మాత్రం పైసలు ఉంటాయా అని బండి సంజయ్ మండిపడ్డారు. 

ఇంటికో ఉద్యోగం ఏమైంది..
ఇంటికో ఉద్యోగం అని ప్రకటించిన సీఎం కేసీఆర్... రాష్ట్రంలో నిరుద్యోగులను నిండా ముంచి తన కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు అని మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన ఇంటికో ఉద్యోగం హామీ ఏమైందని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదని చెబుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి ఇచ్చిన మాట ప్రకారం నడుచుకుంటూ తాజాగా 1 లక్షా 46 వేల ఉద్యోగాలను ఇచ్చిందన్నారు.

Trending News