బండి సంజయ్ ఆగ్రహం

'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో కరీంనగర్ కూడా ఒకటి. ఇంకా చెప్పాలంటే .. ఇండోనేషియా నుంచి వచ్చిన ఏడుగురు వ్యక్తులు కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో తిరిగారు. ఈ నేపథ్యంలో  కరీంనగర్ లో కోవిడ్ 19 విస్తృతి ఎక్కువగా ఉందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎక్కడికక్కడ లాక్ డౌన్ పరిస్థితి కొనసాగుతోంది.

Last Updated : Mar 26, 2020, 04:38 PM IST
బండి సంజయ్ ఆగ్రహం

'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో కరీంనగర్ కూడా ఒకటి. ఇంకా చెప్పాలంటే .. ఇండోనేషియా నుంచి వచ్చిన ఏడుగురు వ్యక్తులు కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో తిరిగారు. ఈ నేపథ్యంలో  కరీంనగర్ లో కోవిడ్ 19 విస్తృతి ఎక్కువగా ఉందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎక్కడికక్కడ లాక్ డౌన్ పరిస్థితి కొనసాగుతోంది. 

'కరోనా వైరస్' బారిన పడ్డ వారికి వెంటనే చికిత్స అందించేందుకు కరీంనగర్  ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఐతే ఐసోలేషన్ లో పని చేస్తున్న వైద్య సిబ్బంది కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు  వచ్చాయి. ఈ క్రమంలో కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్ కేంద్రాన్ని సందర్శించారు.అక్కడి పరిస్థితులను చూసి ఆశ్చర్యపోయారు. 

దేశంలోనే తొలిసారిగా 'కరోనా' ఆస్పత్రి

ప్రపంచవ్యాప్తంగా 'కరోనా వైరస్' చేస్తున్న మారణహోమం తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి పరిసరాలను శుభ్రంగా ఎందుకు ఉంచడం లేదని ప్రశ్నించారు. శానిటైజర్లు అయిపోయినా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. అంతే కాకుండా ఆస్పత్రిలో  పని చేస్తున్న వైద్య సిబ్బంది ఎన్-95 మాస్కులు ధరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లు కూడా సాధారణ మాస్కులు ధరించడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్ని మాస్కులు కావాలన్నా తెప్పించుకోవాలని సూచించారు. అవసరమైతే ఎంపీ నిధుల నుంచి మరిన్ని డబ్బులు  మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News