దేశంలోనే తొలిసారిగా 'కరోనా' ఆస్పత్రి

'కరోనా వైరస్'.. భారత దేశంలో  వేగంగా విస్తరిస్తోంది. ఈ రోజు వరకు 649 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. మున్ముందు ప్రమాదం కూడా ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది.

Last Updated : Mar 26, 2020, 03:49 PM IST
దేశంలోనే తొలిసారిగా 'కరోనా' ఆస్పత్రి

'కరోనా వైరస్'.. భారత దేశంలో  వేగంగా విస్తరిస్తోంది. ఈ రోజు వరకు 649 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. మున్ముందు ప్రమాదం కూడా ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది.

జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ విధించినా ..  పాజిటివ్ కేసులు  బయటపడడం ఆందోళన కలిగిస్తోంది.  కరోనా వైరస్  ను ధీటుగా  ఎదుర్కునేందుకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు అన్ని విధాలా  చర్యలు తీసుకుంటున్నాయి. ఐతే మహమ్మారి మాత్రం విస్తరిస్తూనే ఉంది. దీంతో దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది. 

'కరోనా వైరస్'పై పోరాటానికి పవన్ కళ్యాణ్ రూ. 2 కోట్ల విరాళం

ఈ క్రమంలో లాక్ డౌన్ విధిస్తూనే ఒడిశా ప్రభుత్వం మరో కొత్త నిర్ణయానికి వచ్చింది. కరోనా వైరస్ కు ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు  ప్రత్యేక ఆసత్రి ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా ఓ రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు ఆస్పత్రి ఏర్పాటు చేయడం విశేషం. అంతే కాదు అతి పెద్ద ఆస్పత్రిగా దీన్ని   ఏర్పాటు చేయాలని ఒడిశా సర్కారు నిర్ణయించింది. మొత్తం వెయ్యి పడకల ఆస్పత్రిగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరో 2 వారాల్లో ఇది అందుబాటులోకి వస్తుందని ఒడిశా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

'లాక్ డౌన్'కు మద్దతిస్తాం..!!

మరోవైపు కర్ణాటక ప్రభుత్వం 'కరోనా వైరస్'ను ఎదుర్కునేందుకు  తాత్కాలికంగా ఓ ఆస్పత్రిని ఏర్పాటు చేసుకుంది. బెంగళూరులో ఉన్న బౌరింగ్ లేడీ కర్జన్ మెడికల్ కాలేజీని ప్రత్యేక ఐసోలేషన్  కేంద్రంగా ఏర్పాటు చేశారు. అంటే దీన్ని పూర్తి కోవిడ్ 19 ఆస్పత్రిగా  ఏర్పాటు చేశారు. ఇందులో ఇతర వ్యాధుల కోసం వచ్చే ఔట్ పేషంట్లు రావద్దని బోర్డు పెట్టారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News